Sapthami Gowda: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా కాంతార సినిమా పేరు వినపడుతుంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి సప్తమి గౌడ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం కాంతార. ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ కన్నడ భాషలో విడుదల అయ్యి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక తెలుగులో కూడా ఈ సినిమా అక్టోబర్ 15 వ విడుదల అయింది.

తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ పొందడంతో ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ సినిమాలు నటి సప్తమి గౌడకు ఇది రెండవ సినిమా.ఇలా రెండవ సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమా ఎంతో మంచి విజయం అందుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సప్తమి గౌడమాట్లాడుతూ ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి తనని సంప్రదించి కథ చెప్పినప్పుడు ఇందులో నాకు ఏమాత్రం అవగాహన లేదు అని చెప్పినప్పటికీ నాపై నమ్మకంతో నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు అందుకు రిషబ్ శెట్టి గారికి ధన్యవాదాలు అంటూ తెలియజేశారు.

Sapthami Gowda: నేషనల్ రైడ్ స్విమ్మర్..
ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే 1996 జూన్ 8న బెంగుళూరులో జన్మించారు. తన తండ్రి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేశారట. ఇక ఈమె సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.పాప్ కార్న్ మంకీ టైగర్ తన మొదటి సినిమా కాగా రెండవ సినిమా కాంతారా సినిమా కావడం విశేషం. ఇక ఈమె నేషనల్ వైడ్ స్విమ్మర్ గా పేరుపొందారు. ఇక బుక్స్ చదవడం, ట్రావెలింగ్ చేయడం ఈమె హాబీ అని తెలుస్తుంది.





























