దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు గతంతో పోలిస్తే భారీగా ఆదాయం తగ్గిన నేపథ్యంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఎస్బీఐ కొత్త కొత్త స్కీమ్ లను అమలు చేస్తూ వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది.

తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేర్వేరు డెబిట్ కార్డులపై ఏటీఎం విత్‌డ్రాయల్‌ పరిమితిని గతంతో పోలిస్తే భారీగా పెంచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో విధించిన నిబంధనల వల్ల కొన్ని కార్డులకు రోజుకు 10,000 రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఎస్బీఐ మార్చిన నిబంధనల వల్ల ఎస్బీఐ ఖాతాదారులు రోజుకు 20,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు వాడే కార్డులను బట్టి పొందే ప్రయోజనాల్లో మార్పులు ఉంటాయి. ఎస్‌బీఐ క్లాసిక్‌, మేస్ట్రో డెబిట్‌ కార్డుపై 20,000 రూపాయల వరకు విత్ డ్రాయల్ పరిమితి పెరిగింది. ఎస్బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్‌ డెబిట్‌ కార్డుకు మాత్రం ఎస్బీఐ విత్ డ్రాయల్ పరిమితిని ఏకంగా లక్ష రూపాయలకు పెంచింది. ఎక్కువ మొత్తంలో విత్ డ్రా చేసే కస్టమర్లకు ఎస్బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.

మరోవైపు ఎస్బీఐ డెబిట్ కార్డ్ ద్వారా ఎంపిక చేసిన కస్టమర్లు రుణాలు పొందే సదుపాయాన్ని కల్పిస్తోంది. కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఎస్బీఐ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here