దేశంలో చాలామంది స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాను కలిగి ఉన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఇది. బ్రాంచీల సంఖ్య.. పనిచేసే ఉద్యోగుల సంఖ్యను చూస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు కూడా. 1806లో కోల్‌కతాలో స్థాపించబడిన ఈ బ్యాంకు భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంకులలో ఒకటిగా నిలించింది.

1955లో భారత ప్రభుత్వము ఈ బ్యాంకును జాతీయం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఎస్బీఐ ఖాతా ఉండి.. డెబిట్ కార్డు కలిగిన ఖాతాదారులకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ను కల్పిస్తుంది. ప్రమాదవ శాత్తు ఖాతాదారుడు చనిపోతే .. అతడి నామినీకి రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్ ను క్లయిమ్ చేసుకోవచ్చు. అయితే ఒక్క నిబంధన ఏంటంటే.. ప్రమాదం జరిగిన రోజు దగ్గర నుంచి 90 రోజుల మందు వరకు ఆ కార్డును ఉపయోగించాల్సి ఉంటుంది. లేదంటే.. ఈ ఇన్సూరెన్స్ వర్తించదు.
ఎస్ బీఐ డెబిట్ కార్డులల్లో కూడా తేడాలు ఉంటాయి. అవేంటంటే.. SBI Gold కార్డు ఉన్న వాళ్లకు ఇన్సూరెన్స్ రూ. 4లక్షల వరకు వర్తిస్తుంది. ప్లాటినమ్ కార్డు ఉన్న వాళ్లకు అయితే రూ.10 లక్షలు.. ఎస్బీఐ వీసా సిగ్నేచర్ కార్డు ఉన్నట్లయితే.. రూ. 20 లక్షల వరకు ఇన్సూరెన్స్ ను క్లయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన రూపే డెబిట్ కార్డులకు కూడా ఇన్స్యూరెన్స్ ఉంటుంది.
యాక్సిడెంటల్ డెత్ లేదా టోటల్ డిసేబిలిటీ మాత్రమే కవర్ అవుతుంది.ఈ కార్డు కలిగిన వారికి రూ.2లక్షల వరకు క్లయిమ్ చేసకోవచ్చు. అది కూడా యాక్సిడెంట్ అయిన 45 రోజులు ముందు ఆ కార్డును వాడాల్సి ఉంటుంది. మిగతా అన్నీ కార్డుల్లో 90 రోజుల కంటే ముందు వరకు ఉంటుంది.
































