తలపైకి ఎత్తి అరుస్తున్న పాము.. అసలు నిజమేంటంటే?

0
74

సాధారణంగా మనకు పాములు చడీ చప్పుడు లేకుండా ముళ్లపొదల్లో దాక్కొని ఉండటం చూస్తూ ఉంటాము. అదేవిధంగా పాములకు ఏదైనా ప్రమాదం తలపెడితే అవి మనపై దాడి చేసి మనల్ని కాటు వేస్తాయి. ఇదివరకు పాముల గురించి మనకు ఇది మాత్రమే తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా పాములు తలపైకెత్తి అరవడం విన్నారా? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మకాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గుర్తించారు. ఈ పాము వింత ఆకారంలో ఉండి తల పైకెత్తి అరుస్తున్న వీడియోను వెలిచాల గ్రామస్తుడు సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఈ పాము విషయమే రాష్ట్రమంతా తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా. అయితే ఈ పాములు చూసిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. ఈ పాము విషయంపై స్పందించిన స్థానిక ఎస్ఐ తాండ్ర వివేక్ మాట్లాడుతూ…ప్రజలు ఎవరు ఎలాంటి భయాందోళనలు పెట్టుకోకూడదు అని వారికి ధైర్యం చెప్పారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న ఈ వీడియో పూర్తిగా అబద్ధం అని, గత నెల రోజుల క్రితమే ఈ పాముకి సంబంధించిన వీడియోను విదేశాలకు చెందిన మైక్ మార్టిన్ అనే యూట్యూబర్ తన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడని, ఈ వీడియోనే కొందరు ఆకతాయిలు వెలిచాల గ్రామంలో చూశామని పేర్కొంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ విధమైనటువంటి పోస్ట్ చేశారని ప్రజలకు ధైర్యం చెప్పారు.

ఈ వీడియో పోస్ట్ చేసిన యువకుడిని విచారించి అసలు విషయం బయట పెడతామని ఈసందర్భంగా ఎస్ఐ తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు ఇది ఇండియాలో కనిపించే పాము కాదని, ఇలాంటి జాతికి చెందిన పాములు కేవలం నార్త్ అమెరికా వంటి ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయని కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here