సింహం, పులులు లాంటి క్రూర జంతువులు అంటే ప్రతీ ఒక్కరికీ భయం ఉండటం సహజం. చిన్న పిల్లలకైతే వాటిని టీవీల్లో చూస్తేనే భయపడిపోతుంటారు. కానీ ఇక్కడ సింహాలను అతి దగ్గర నుంచి చూసే ఏర్పాట్లను చేశారు. అదెలా అంటారా.. పర్యాటకులను నేరుగా బోనులోకి పంపిస్తారు. ఆ తరువాత ఆ బోనును సింహాల ఉన్న చోటికి తీసుకెళ్లి వదిలేస్తారు. ఈ సింహాలు దగ్గరకు వస్తాయి.. అక్కడ సీన్ ను ఊహించుకుంటేనే ఒళ్లు అదురుతోంది కదా.. అయితే ఇలాంటి ప్రయోగాలను చేస్తున్నారు.. దక్షిణాఫ్రికాలోని జీజీ సింహాల సంరక్షణ కేంద్రం నిర్వాహకులు.

వివారాల్లోకి వెళ్తే.. ఆ బోనును గట్టి గ్లాసుతో తయారు చేస్తారు. వాటిపై ఎంత పెద్ద బండ రాయి వేసిన పగలదు. సింహాలు కాదు కదా.. ఎనుగులు ఎక్కి తొక్కినా ఆ గ్లాస్ పగలదు. 53 ఏళ్ల సుజనా స్కాట్ అనే ఫోటోగ్రాఫర్ ఈ బోనులో నుంచి సింహాలను షూట్ చేశాడు. ఇక్కడి సింహాల సంరక్షణ కేంద్రం నిర్వాహకులు టూరిస్టులతో పాటు సింహాల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు.
టూరిస్టులకు ఇది ఓ థ్రిల్లింగ్ అనుభవం. ఈ బోను జర్మనీకి చెందిన ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఇచ్చారంట. ఒక టీవీ షో కోసం అతడు ఆ బోనును తయారు చేసుకొని వచ్చి సింహాల దగ్గరకు వెళ్లి మరీ షూట్ చేశాడు. వెళ్తూ.. వెళ్తూ.. ఆ బోనును జూ నిర్వాహకులకు ఇచ్చేశాడు. అయితే దానిని పర్యాటకులకు కూడా ఉపయోగపడే విధంగా వాడుకుంటున్నారు. ప్రతి రోజు బోనును ఇంజినీర్లతో పర్యవేక్షిస్తారు. ఇది సింహాలకు కూడా ఓ ఛాలెంజ్‌గా ఉంటుంది.
ప్రపంచంలోనే ఇలా సింహాల దగ్గరకు వెళ్లి పర్యాటకులు వాటిని చూసే అవకాశం కల్పించదు. పర్యాటకులు బోనులో ఉండి.. సింహాలను దగ్గరగా చూడొచ్చు. వాటిని ఫోటోలు కూడా తీసుకోవచ్చు. సింహాలు బోను మీద నిలబడి వాటిని తెరవడానికి కూడా ప్రయత్నిస్తుంటాయి. కానీ బోనులో ఉన్న వాళ్లు భయపడాల్సిన అవసరం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.































