సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాల నుంచి ఎంతో మంది సీనియర్ హీరోలతో పాటు నేడు కుర్ర హీరోల సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో అందరి అభిమానాన్ని సంపాదించుకున్న నటి అన్నపూర్ణమ్మ అంటే అందరికి అభిమానమే. అయితే అన్నపూర్ణమ్మ సినిమా ఇండస్ట్రీలో కొన్ని అపార్థాలకు తావిస్తోందని కామెంట్లు వినిపిస్తుంటాయి.ఈ క్రమంలోనే ఈమె డైరెక్టర్లతో గొడవపడి కొందరి డైరెక్టర్ల సినిమాల్లో నటించనని ఖరాఖండిగా చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉండగా ప్రముఖ దర్శకుడు ఇండస్ట్రీ మొత్తం గురువుగా భావించే దేవదాస్ కనకాల గురించి అన్నపూర్ణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చనిపోయినప్పటికీ ఆయన ఒక ల్యాండ్ విషయంలో తనని దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. చెన్నైలో ఉంటున్న తనకు హైదరాబాద్లో ఉంటున్న ఒక భూమిని అమ్మారని, తరువాత అదే భూమిని వెంచర్స్ వేసి మరొకరికి అమ్మి తనని మోసం చేసినట్లు తెలిపారు.
ఇదే విషయం గురించి దేవదాసు కొడుకు రాజీవ్ కనకాల ని అడిగితే తనకు ఏమీ తెలియదని అంటూ సమాధానం చెప్పాడు. అయితే ఇప్పటికీ తనకి ఈ విషయం గురించి ఫోన్ చేస్తే మాత్రం తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని,మధ్యవర్తితో ఈ విషయం గురించి మాట్లాడితే తనకు అసలు ఈ ల్యాండ్ విషయం ఏమీ తెలియదని సమాధానం చెప్పారని అన్నపూర్ణమ్మ తెలిపారు.
దేవదాసు కనకాల గారు నాకు భూమి అమ్మిన విషయం వారి కుటుంబంలో వారికి తెలుసు కానీ తెలియదు అని చెబుతున్నారు పోనివ్వండి వాళ్లు ఈ భూమినే పట్టుకొని ఉంటారా? నేను నేను పట్టుకోకుండా పోతనా? కాస్త ముందు నేను పోతా… ఆ తరువాత వాళ్లు వస్తారు.. మొత్తానికి అందరం వెళ్లే వాళ్ళమే ఇది నా శాపమైనా అనుకోండి..తిట్టడం .. అనుకోండి అంటూ అన్నపూర్ణమ్మ కనకాల కుటుంబం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.



























