ఒకప్పటి అందాల నటి హీరోయిన్ ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో సహజసిద్ధమైన నవ్వులను పంచుతూ జడ్జి స్థానానికి న్యాయం చేస్తున్నారు. ఇక సినిమాల పరంగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ సందడి చేస్తున్న ఇంద్రజ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన లవ్ స్టోరీ గురించి బయట పెట్టారు.

ఈ సందర్భంగా ఇంద్రజ తన భర్త మహ్మద్ అబ్సర్‌తో ప్రేమ పెళ్లికి సంబంధించిన కొన్ని విషయాలను ముచ్చటించారు. నేను తెలుగు బ్రాహ్మణ అమ్మాయిని. ఇప్పటికీ కూడా బ్రాహ్మణ అమ్మాయి గానే ఉన్నాను. కానీ నా భర్త మాత్రం ముస్లిం. తన మనసుకు నచ్చిన ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంటూ మనసుకి, మతానికి సంబంధం ఉండదు అంటూ ఈమె తెలిపారు.

ఆరు సంవత్సరాల నుంచి ఇద్దరం మంచి స్నేహితులుగా ఉంటూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తరువాతే, తను అన్ని విషయాలలో ఎంతో సపోర్ట్ గా ఉంటాడని నమ్మినప్పుడే అతడిని వివాహం చేసుకున్నాననే ఈ విషయాన్ని ఇంద్రజ తెలిపారు.మహ్మద్ అబ్సర్‌ కి ఇండస్ట్రీతో పరిచయం ఉంది. ఆయన రైటర్ గా, యాడ్ ఫిలిమ్ మేకర్ గా,పలు సీరియల్స్ లో కూడా నటించారు. అదేవిధంగా వారి కుటుంబానికి బిజినెస్లు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు.ఇండియాలో ఆ బిజినెస్ లన్నీ తన భర్త , మామగారు చూసుకుంటే కాలిఫోర్నియాలో తన బావగారు చూసుకుంటారని తెలిపారు.

ఇంద్రజ తన భర్తతో కలిసి సినిమాల గురించి చర్చించుకుంటారని, నేను చేసే సినిమాలలో కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఉండేదని, అయితే అది కొంతవరకు మాత్రమే ఉండేది. ఇప్పటివరకు తన భర్త ఇది చేయాలి, అది చేయకూడదనే ఎలాంటి షరతులు ఎప్పుడు పెట్టలేదని ఇంటర్వ్యూ సందర్భంగా ఇంద్రజ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here