Senior Heroine Krishnaveni : ‘మనదేశం’ సినిమా సీనియర్ ఎన్టీఆర్ మొదట తెలుగు తెరకు పరిచయమైన సినిమా. ఆ సినిమాలో చిన్న వేషంలో ఎన్టీఆర్ కనిపించారు. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన నటి సి.కృష్ణవేణి. నిర్మాతగా కృష్ణవేణి గారు నిర్మించిన మన దేశం సినిమా ద్వారా ఎన్టీఆర్ ను ఘంటసాల గారిని, ప్లే బ్యాక్ సింగర్ పి. లీలా గారిని పరిచయం చేసారు. ఆమె నాటక రంగం ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టారు. కీలు గుర్రం, బాల మిత్రుల కథ వంటి సినిమాల్లో పాటలను కూడా కృష్ణ వేణి గారు పాడారు.

ఆస్తులను స్వాదినం చేసుకున్న తమిళనాడు ప్రభుత్వం…
సతీ అనసూయ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా అడుగుపెట్టిన కృష్ణవేణి గారు ఆ సినిమాలో నటించిన సమయానికి ఆమె వయసు కేవలం 12 సంవత్సరాలు. పుల్లయ్య డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా కు ఆమెను రేలంగి వెంకటరామయ్య గారు కృష్ణవేణి గారిని పరిచయం చేసారు. ఇక మీర్జాపురం రాజు వారి జయ ఫిలిమ్స్ నిర్మించిన ‘భోజ కాళిదాసు’ సినిమాలో కృష్ణవేణి సెకండ్ హీరోయిన్ కాగా మొదటి హీరోయిన్ కన్నాంబ గారు. చాలా వరకు జయ ఫిలిమ్స్ లో నటించిన కృష్ణవేణి గారు రాజుగారిని పెళ్లి చేసుకన్నారు.

పెళ్ళయ్యాక సినిమాలకు దూరమైన కృష్ణవేణి గారు కేవలం సొంత బ్యానర్ లో మాత్రమే నటించారు. 1974 లో రాజావారు మరణించారు అయినా ఆర్థికంగా ఇబ్బందులు పడలేదు కృష్ణవేణి గారు. అయితే అప్పటి తమిళనాడు ప్రభుత్వం రాజావారికి సంబంధించిన కొన్ని ఆస్తులను జప్తు చేసుకున్నారు. నేటి విజయవాడ గన్నవరం విమానాశ్రయం ఉన్న స్థలం రాజావారు దానం చేసినదే అందుకే ఆయన పేరునే పెట్టారు. ఇప్పటికీ తమిళనాడు ప్రభుత్వం ఆస్తులను స్వాధీనం చేసుకున్నందుకు కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి.































