Senior Journalist Bhardwaja : నోరు జారితే వెనక్కి తీసుకోలేము. ఇది సామాన్యులకు ఏమో గాని సెలబ్రిటీలకు మాత్రం మరింత వర్తిస్తుంది. ఒక్కసారి పబ్లిక్ లో ఏదైనా నోరు జారి తప్పుగా మాట్లాడినా ఇమేజ్ డామేజ్ అవుతుంది. పొలిటికల్ లీడర్స్ అలానే సినిమా వాళ్లకు నోరు అదుపులో ఉండాలనేది అందుకే. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ నోరు జారి చిక్కుల్లో పడ్డట్టే ఉంది. సీనియర్ నటులు అప్పట్లో సినిమాల గురించి మాట్లాడుతూ అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడటంతో అక్కినేని అభిమానులు అగ్రహానికి గురయ్యారు. ఇక ఇదే విషయం మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.

బాలకృష్ణ మీద దాడి జరగాలి…
భరద్వాజ గారు ఈ ఇష్యూ మీద మాట్లాడుతూ బాలకృష్ణ ఈ మధ్య కాలంలో తన ఇమేజ్ కి తగ్గట్టు వ్యవహరించడం లేదంటూ మాట్లాడారు. అన్ స్టోపబుల్ షో హిట్ అయ్యాక బాలకృష్ణ లో మార్పు వచ్చిందని, తాను ఒక ఎమ్మెల్యే, అలానే ఒక సీనియర్ హీరో అనే విషయం మర్చిపోయి మాట్లాడటం అలానే చేతలు ఉంటున్నాయంటూ చెప్పారు. ఇటీవల వీర సింహా రెడ్డి సినిమాలో నటించిన హీరోయిన్ హనీ రోజ్ తో కలిసి గ్లాసులను ఇద్దరి చేతులు మెలికలు పెట్టి పట్టుకున్న ఫోటో వైరల్ అయింది. ఇలాంటివి బయటకు రాకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది అంటూ తెలిపారు.

ఇక ఇప్పుడు అప్పటి లెజెండ్రి నటులైన రంగారావు గారిని అలానే అక్కినేని ని అవమానించారని, అది మాట దొర్లడమే అయినా క్షమాపణ కూడా చెప్పలేదు అంటూ అభిప్రాయాపడ్డారు. బాలకృష్ణ ఇలా మాట జారడం ఇది తొలిసారి కాదు, అతని నేచర్ అదే. అని అక్కినేని ఫ్యామిలి అలానే అక్కినేని అభిమానులు కూడా వదిలేసి ఉండవచ్చు కానీ ఇలాంటివి మళ్ళీ పునరావృతం అవ్వకూడదంటే బాలకృష్ణ మీద దాడి జరగాలి. తొక్కమూరి అని అతన్ని అంటే తెలుస్తుంది. బాలకృష్ణ వరకు నిరసన వెళితేనే అతడికి తాను మాట్లాడింది తప్పు అని తెలుస్తుంది అంటూ అభిప్రాయపడ్డారు.































