Senior Villain Ponnambalam : విలన్ గా, స్టంట్ మాస్టర్ గా వందల సినిమాల్లో నటించిన నటుడు పొన్నంబలం. తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించిన పొన్నంబలం తెలుగులో ఘరానా మొగుడు, హిట్లర్, మెకానిక్ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, చూసోద్దాం రండి, నువ్వొస్తావని వంటి సినిమాలతో విలన్ గా నటించారు. ఎన్నో సినిమాల్లో నటిస్తూనే అటు రాజకీయాల్లోను క్రియాశీలకంగా ఉన్న పొన్నంబలం ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చిన్న గదిలో ఉన్నారు.అయితే ఆయనను మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సహకారం అందించి ఆదుకున్నారు. తాజాగా ఆయన ఇంటర్వ్యూ లో ఆయన జీవితంలో జరిగిన విషయాలను పంచుకున్నారు.

అన్న,వదిన విషం పెట్టారు….
పొన్నంబలం ఒక్కసారిగా సినిమాలలో స్టంట్ మాన్ గా అలాగే సోలో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాక సినిమాల్లో బిజీ అయ్యారు బాగా సంపాదించారు. తన అన్న కుటుంబం కూడా సినిమాల్లో నే ఉన్న వారికి అంత సక్సెస్ రాకపోవడం వల్ల బాగా అసూయ చెంది పొన్నంబలం ను చంపేయాలని అనుకున్నారట. అందుకే మొదట తాగే మందులో కొద్ది కొద్దిగా విషం పెట్టేవారట. ఇక ఒకరోజు నిద్ర పట్టక బయటికి వచ్చి చూస్తే తన బట్టలను కొంచం కత్తిరించి అలాగే జుట్టు అన్ని ఒక గోయి తవ్వి అందులో వేసి ఏదో మంత్రాలను చదవడం చూసారట.

పొన్నంబలం కి అనుమానం వచ్చి పిఏ గా చేస్తున్న మనిషిని పిలిచి అడిగితే అతను చేతబడి చేస్తున్నారని చెప్పేసాడట. ఇక తినే అన్నంలో విషం కలిపారని అతను చెప్పడంతో తెలిసీ జాగ్రత్త పడ్డారట. ఇక ఒక్కసారిగా షూటింగ్ స్పాట్ లో హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ వెళితే కిడ్నీ లు రెండు పాడైపోయాయాని చెప్పారట డాక్టర్స్. అలా వాళ్ళు ఇచ్చిన పాయిషన్ వల్ల చావు వరకు వెళ్లానంటూ చెప్పారు. చనిపోవాలని అనుకునే సమయంలో చిరంజీవి గారు ఆదుకున్నారు అంటూ చెప్పారు.