ఆకాశ్ దీప్.. ఈ పేరు ఇప్పుడు భారత క్రికెట్ ప్రేమికుల నోట ఎక్కువగా వినిపిస్తుంది.. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్‌పై టీమిండియా చారిత్రక విజయం సాధించిన టెస్టులో అతడు ప్రదర్శించిన అద్భుత బౌలింగ్‌కు దేశమంతా ఫిదా అయింది. 58 ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ మైదానంలో తొలి గెలుపు అందించిన మ్యాచ్‌లో ఆకాష్ దీప్ కీలకంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి మొత్తం 10 వికెట్లతో ఇంగ్లండ్‌ను కుప్పకూల్చిన అతను విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ యువ బౌలర్ సాధారణ కుటుంబంలో పుట్టాడు. బీహార్‌లోని డెహ్రీ అనే చిన్న పట్టణంలో జన్మించిన ఆకాష్ దీప్, చిన్న వయసులోనే తన తండ్రి, అన్నను కోల్పోయి తీవ్ర ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడాడు. కుటుంబ బాధ్యతలన్నీ తన భుజాలపై పడినప్పటికీ, తన లక్ష్యాన్ని మరచిపోకుండా క్రికెట్‌పైనే దృష్టి పెట్టాడు. బెంగాల్‌కు వలస వెళ్లి దేశవాళీ క్రికెట్‌లో అవకాశాన్ని సంపాదించుకున్న అతను, 2019లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో కెరీర్ ప్రారంభించాడు.

ఆ తర్వాత ఆకాష్ దీప్ పోరాటం కొనసాగింది. తన ప్రతిభను నిరూపించుకుంటూ రంజీ ట్రోఫీ, విజయ్ హాజారే వంటి టోర్నీల్లో తనదైన ముద్ర వేశాడు. ఐపీఎల్‌లో కూడా అతనికి గుర్తింపు దక్కింది. 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన తరువాత, 2025లో రూ.8 కోట్ల భారీ డీల్‌తో అతని జీవితం మలుపు తిరిగింది. ఇదే ఏడాది అతను భారత జట్టులో ప్రవేశించి ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. అతని స్పీడ్, లైన్ అండ్ లెంగ్త్ ఖచ్చితత్వంతో బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. ఈ మ్యాచ్ తరువాత ఆకాష్ దీప్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి ఎంతో వేగంగా ఎదిగిన అతని కథ ప్రతి యువ క్రికెటర్‌కు ప్రేరణగా నిలుస్తోంది. ప్రస్తుతం అతనికి BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ లేనప్పటికీ, బెంగాల్ క్రికెట్ బోర్డు, మ్యాచ్ ఫీజులు, ఐపీఎల్ ద్వారా భారీ ఆదాయం సంపాదిస్తున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో రూ.10 కోట్లకు పైగా సంపాదించాడు. 2025లో లభించిన రూ.8 కోట్ల జీతం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
ఇప్పటికీ ఆకాష్ దీప్ తన జీవితం పట్ల అహంభావం లేకుండా సాధారణంగా వ్యవహరిస్తున్నాడు. అతని నెట్ వర్త్ దాదాపు రూ.41.4 కోట్లు కాగా, కోల్‌కతాలో రూ.2 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశాడు. మహీంద్రా థార్, కియా సెల్టోస్ వంటి కార్లను కలిగి ఉన్న అతను, భవిష్యత్తులో BMW లేదా ఆడిని కొనాలని భావిస్తున్నాడు. ఒకప్పుడు కుటుంబ పోషణ కోసం రోజుకో పని చూసుకోవాల్సిన స్థితిలో ఉన్న ఆకాష్ దీప్, ఇప్పుడు లక్షలాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. క్రికెట్‌ను కేవలం ఆటగా కాకుండా, జీవిత మార్గంగా చూసిన అతని పట్టుదల, కష్టపడి సాధించాలన్న తపనను చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ యువ పేసర్ టీమిండియాలో స్థిరపడి భవిష్యత్‌లో మెరుగైన ఆటగాడిగా ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు. అతని పోరాటం, నిబద్ధత, ఆటతీరు చూస్తే భారత్‌కు మరో మోస్ట్ రిలైయబుల్ పేసర్ దొరికినట్టే అని నిస్సందేహంగా చెప్పొచ్చు.



























