Serial Actress: కోలీవుడ్ సీరియల్ జంట వివాదం రోజు రోజుకు ఓ కొత్త మలుపు తిరుగుతుంది. ఈ వివాదం రోజురోజుకు ఎన్నో వివాదాలను ఎదుర్కొంటూ ముదురుతూనే ఉంది. కోలీవుడ్ నటులు ఆర్నవ్ దివ్య ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే దివ్య ప్రెగ్నెన్సీ సమయంలో ఆర్నవ్ అన్షిత అనే మరో అమ్మాయితో ఎంతో చనువుగా ఉన్నారు. దీంతో ఈ దంపతుల మధ్య పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.
ఈ క్రమంలోనే దివ్య తన భర్తను వలలో వేసుకొని అన్షిత తన కాపురంలో చిచ్చు పెట్టింది అంటూ చేసిన ఆరోపణలు నిజమయ్యాయి. తాజాగా అన్షిత దివ్యకు ఫోన్ చేసి తనని చంపుతాను అంటూ బెదిరించినటువంటి ఒక ఆడియో కాల్ లీక్ అవడంతో అసలు వ్యవహారం బయటపడింది.ఇందులో అన్షిత దివ్యను ఏకంగా చంపుతానని బెదిరించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
నువ్వు ఒక ఆడపిల్లవి అయుండుకొని మరొక ఆడదాని జీవితాన్ని నాశనం చేయడానికి సిగ్గు లేదా అంటూ ఎమోషనల్ కాగా అందుకు అన్షిత స్పందించి ఇప్పుడు కనుక నువ్వు నాకు కనబడితే నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి కుక్కలకు వేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది.ఈ భూమిపై నువ్వు ఇంకా ఎందుకు బతికున్నావ్ ఈ భూమికి భారంగా అంటూ తనని ఇష్టమొచ్చినట్లు తిట్టింది.
Serial Actress: ఆర్నవ్ ను రెండో పెళ్లి చేసుకున్న దివ్య..
ఇకపోతే తన ప్రియుడు ఆర్నవ్ తో కాన్ఫరెన్స్ కాల్ లో ఉన్నటువంటి అన్షిత ఇప్పుడు చూడు ఆర్నవ్ తో నేనేం చేస్తానో అంటూ ఏకంగా ఫోన్లోనే తనకు ముద్దులు పెట్టింది. ప్రస్తుతం ఈ ఆడియో కాల్ లీక్ అవడంతో సోషల్ మీడియాలో దివ్యకు భారీ మద్దతు పెరిగింది. అయితే దివ్య ఆర్నవ్ ను రెండవ వివాహం చేసుకున్నారు.ఈమె ఇదివరకే ఓ వ్యక్తిని వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నారు. అయితే అదే సమయానికి ఆమెకు ఏడాది పాప ఉన్నప్పటికీ ఆర్నవ్ ఇష్టపడటంతో తనని పెళ్లి చేసుకున్నారు.ఇక దివ్య తర్వాత ప్రెగ్నెంట్ కావడంతో ఆప్పటి నుంచి తనని ఆర్నవ్ దూరం పెడుతూ వచ్చారని ఈమె వెల్లడించారు.