Serial Actress: బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ లకు ఎంతో మంచి ఆదరణ ఉందని చెప్పాలి.ఇలా బుల్లితెరపై సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతి ఒక్క చానల్లోనూ ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇలా సీరియల్స్ ద్వారా సీరియల్ నటిమణులు కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా వీరి క్రేజ్ చూసి వీరి రెమ్యూనరేషన్లు కూడా అదే స్థాయిలోనే అందుకుంటున్నారని చెప్పాలి.

ఇక ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన సీరియల్ ఏంటి అంటే టక్కున అందరూ కూడా కార్తీకదీపం సీరియల్ అని చెబుతారు. ఇలా కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్.ఇలా ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రేమి విశ్వనాథ్ రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో పుచ్చుకుంటున్నారు.
ఈమె ఒక రోజు షూటింగ్ లొకేషన్లో ఉండాలి అంటే తప్పనిసరిగా 30 వేల రూపాయలు చెల్లించాల్సిందే. ఈమెతో పాటు కస్తూరి, నవ్య స్వామి, మేఘన లోకేష్, సుజిత వంటి సెలబ్రిటీలు కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇక వీరందరూ కూడా ఒక్క కాల్ షీట్ కోసం సుమారు 25వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Serial Actress:భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న నటీమణులు…
ఇక అర్చన అనంత్,అనిలా శ్రీకుమార్, శోభా శెట్టి లాంటివారు ఒక్కరోజు కాల్షీటుకు రూ.15 వేల రెమ్యూనరేషన్ను తీసుకుంటున్నారట.ఇలా బుల్లితెరపై ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఈ సెలబ్రిటీలో రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో తీసుకుంటున్నారని చెప్పాలి. ఇక ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ పూర్తి కావడంతో ఎంతోమంది అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.