Serial Actress Sunandha: సినిమా ఇండస్ట్రీ నుంచి బుల్లితెర నటీనటులు వరకు ప్రతి ఒక్కరు వైవాహిక జీవితంలో స్థిరపడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు నటీనటులు ఇప్పటికే వివాహం చేసుకోగా మరికొందరు నిశ్చితార్థం జరుపుకొని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే సీరియల్ నటి వైష్ణవి పెళ్లి ఘనంగా జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా జబర్దస్త్ కమెడియన్ ఆర్పీ ఘనంగా నిశ్చితార్ధం జరుపుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ముద్దమందారం సీరియల్ తో విలన్ గా ఎంతో గుర్తింపు పొందిన నటి సునంద అందరికీ సుపరిచితమే. ఈ క్రమంలోనే ఈమె పలు తెలుగు సీరియల్స్ లో నటించి మెప్పించారు. సునంద త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటికే ఈమె ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక సునంద తనకు కాబోయే భర్త పేరు శంకర్ అని తెలిపారు.

ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న సునంద తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా తన ఎంగేజ్మెంట్ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈమె నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. వైజాగ్ లో పుట్టి పెరిగిన సునంద ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు.
విలన్ గా గుర్తింపు పొందిన సునంద….
ఎంవిఆర్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన సునందకి డాన్సింగ్ అంటే చాలా ఇష్టమట. ఇలా చిన్న చిన్న పాత్రల ద్వారా సీరియల్స్ లో నటించిన ఈమె ప్రస్తుతం వరుస సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. బుల్లితెర నటిగా అందరినీ మెప్పించిన ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ నిశ్చితార్థం ఫోటోలు వైరల్ అవుతున్నాయి.































