ఎన్టీఆర్ ముందే గుప్పు గుప్పుమని సిగరెట్ తాగిన ఈ హీరోయిన్ దమ్ము గురించి తెలిస్తే అవ్వాల్సిందే..!

0
810

హీరోయిన్ మంజుల… ఈమె గురించి ప్రస్తుత జనరేషన్ వారికి తెలియకపోవచ్చు. కానీ మన తండ్రి తరం వారికి బాగా తెలిసిన నటీమణి. ఈవిడ 1953 వ సంవత్సరం సెప్టెంబర్ 9న జన్మించారు. అందం, అభినయం నటన చిలిపితనం ఇలా ఆమె ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఎంతటి అగ్రతార అయినా సరే ఆమెతో మాట్లాడాలంటే చాలా ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు. ఇక మంజుల సినిమా రంగం విషయానికొస్తే ఈవిడ 1965 వ సంవత్సరంలో శాంతి నిలయం చిత్రం ద్వారా బాలనటిగా వెండితెరపై ఆరంగేట్రం చేశారు. ఇక ఆ తరువాత తమిళ హీరో ఎంజీఆర్ “రిక్షాకరం” అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. అయితే 1970 దశకంలో మంజుల టాప్ హీరోయిన్ గా కొనసాగింది.

ఇక అసలు విషయానికి వస్తే… ఒకసారి సీనియర్ ఎన్టీఆర్ గారితో మగాడు సినిమాలో నటించేటప్పుడు ఒక సీన్ లో మంజుల సిగరెట్ తాగే సన్నివేశం ఉంది. షూటింగ్ చేసే సమయంలో పొగ వస్తే ఇబ్బంది పడతారని ఉద్దేశంతో ముందుగా ఎలా తాగాలో అని రిహార్సల్ కోసం ఎన్టీఆర్ గారు ఉన్న పక్కనే కూర్చొని సిగరెట్ ని కాల్చడం మొదలు పెట్టింది. ఇక దానితో సీనియర్ ఎన్టీఆర్ ఏం మేడం రిహార్సల్స్ లో కూడా పొగను వదులుతున్నారు అని కాస్త గదమాయించి అడిగారట. అయితే దానికి మంజుల అదేం లేదండి మగవారు సిగరెట్ తాగుతారు కదా వారికి ఏదో వస్తుంది అంట కదా అలాంటిది ఎలా ఉంటుందో తెలుసుకుందామని గల్లున నవ్వుతూ సమాధానం ఇచ్చిందట. అయితే ఈ విషయాన్ని ఎన్టీఆర్ కూడా నవ్వుతూ ఆస్వాదించటం జరిగిందట.

ఇకపోతే, మంజుల జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదురైనా చెప్పవచ్చు. కెరియర్ కొన్ని రోజులు బాగున్న ఆ తర్వాత పాత్రలు దక్కక మళ్లీ తన స్థానాన్ని కోల్పోయింది మంజుల. అయితే ఈవిడ సినిమాలు చేసే రోజులలో తమిళనాడులోని ఒక బడా రాజకీయవేత్త కుమారుడు ఆమె ఎక్కడ షూటింగ్ చేస్తుంటే అక్కడికి వచ్చి తను అంటే ఇష్టమని తెలుపుతూ ఇబ్బంది పెట్టేవాడు అని తెలిపింది. ఒకవేళ తాను అతను అంటే ఇష్టం లేదు అని చెబితే ఎలాంటి రాజకీయ విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో ఏం చెప్పలేక ఉన్న స్థితిలో అప్పటికే పెళ్లి అయి ఇద్దరు పిల్లలకు తండ్రిగా ఉన్న ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ కుమార్ ను రెండవ పెళ్లి చేసుకుంది. నిజానికి ఆవిడ రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం ఆ బడా రాజకీయవేత్త కుమారుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే తనని ఇబ్బంది పెడుతున్న సమయంలో ఎవరైనా తనకు సపోర్ట్ చేస్తే బాగుంటుందన్న సందర్భంలో విజయ్ కుమార్ మంజులకు దగ్గరయ్యారు. దీనితో వారిద్దరు వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ ముగ్గురు కుమార్తెలు జన్మించారు.ఆ ముగ్గురిలో ఒకరైన శ్రీదేవి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఇప్పటికే నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి పిల్లలు తర్వాత తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. కానీ తన నటనకు ఎక్కువ ప్రాధాన్యత లేకపోవడంతో సినిమాల నుంచి తప్పుకుంది అని చెప్పవచ్చు. అయితే ఈవిడ 2013 జూలై 23న చెన్నైలో తుది శ్వాస విడిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here