గూడ్స్ రైళ్లలో ఎక్కువగా రసాయన పదర్ధాలు లేదా మరేదైనా ఉపయోగపడే వస్తువులను సరఫరా చేస్తూ.. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ఎగుమతి.. దిగుమతి చేస్తుంటారు. అయితే ఓ గూడ్స్ రైలు విజయవాడ నుంచి భద్రాచలం వైపు వెళ్తోంది. ఖమ్మం స్టేషన్ దాటి వెళ్తున్న క్రమంలో డోర్నకల్ వద్ద ఒక్కసారిగా పట్టాలు తప్పింది. దంతో ఆ రైలులోని భోగీలపై ఉన్న వ్యాగన్లు ఓ పక్కకు ఒరిగాయి.

ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వర్షం కురుస్తున్నప్పడటికీ ఆ వ్యాగన్లను పునరుద్దరించే చర్యలు చేపట్టారు. దీంతో రైళ్ల రాకపోకలు అంతరాయం కలిగింది.

మరో ఘటన… రైలు పట్టాలు తప్పడంతో ముగ్గురు మృతి.. ఇదిలా ఉండగా.. అమెరికాలోని మోంటానలో రైలు పట్టాలు అదుపు తప్పిన ఘటనలో ముగ్గురు చనిపోగా.. దాదాపు 50 మంది గాయపడ్డారని రైల్వే సంస్థ అమ్‌ట్రాక్ తెలిపింది. సంఘటన స్థలంలో సాయక చర్యలు మొదలయ్యాయని పేర్కొంది. ఇందులో సుమారు 141 మంది ప్రయాణీకులు, 16 మంది సిబ్బంది ఉన్నారు.
Passenger video
— John Tharp (@JohnPTharp) September 26, 2021
3 killed many hospitalized Amtrak Empire Builder train derail rural Montana – cars on side
Chicago-Seattle / Portland long distance passenger train w/coach & sleeper cars@jacob_cordeiro video, apparently PAX on board
video, apparetnly PAX on board pic.twitter.com/PHj66hg1EJ
మోంటానలోని జోప్లిన్ వద్దకు రైలు రాగానే… పట్టాలు తప్పింది. మోంటాన స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డు వెంటనే దర్యాప్తు చేపట్టింది. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. హిల్ కౌంటీ మొంటానాలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. గాయపడినవారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. కనీసం ఐదు హాస్పిటళ్లు వీరికి చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నాయి.



























