Malayala Star: మళయాళ స్టార్ హీరో దిలీప్ కుమార్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. 2017లో ఓ మళయాళ నటిని లైంగికంగా వేధింపులకు గురిచేశారనే కేేసులో నాన్ బెయిలబుల్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఏకంగా ఓ స్టార్ తన సహ హీరోయిన్ పై మనుషులను పెట్టించి మరీ లైంగికంగా వేధించడం అప్పట్లో సంచలనం రేపింది. కారులో నడుపుతూ సదరు నటిని లైంగికంగా వేధించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా మళయాళ స్టార్ దిలీప్ ఉన్నారు.

అయితే ఆ సమయంలో ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వచ్చాయి. దీంతో దిలీప్ కుమార్ కు శిక్ష ఖచ్చితంగా పడుతుందని అంతా అనుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి శిక్ష పడలేదు. ఘటన జరిగిన సమయంలో అరెస్ట్ చేసినా.. తరువాత బెయిల్ పై వచ్చిన దిలీప్ కుమార్ మళ్లీ వరసగా సినిమాలు చేస్తున్నాడు.
ఇన్ని సంవత్సరాలు గడిచినా..
ఈ ఘటన అనంతరం కర్ణాటక ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిన ఆ నటి వివాహం చేసుకుంది. అయితే ఘటన జరిగి 5 ఏళ్లు అవుతున్నా.. తనకు న్యాయం దక్కలేదని ఇటీవల బాధిత హీరోయిన్ కేరళ సీఎం పినరయి విజయన్ కు లేఖ రాసింది. పినరయి విజయన్ కు రాసిన లేఖలో ఈ ఘటన జరిగి 5 ఏళ్లు గడుస్తున్నా.. తనకు న్యాయం జరగలేదని.. మీరే న్యాయం చేయాలంటూ లేఖలో పేర్కొంది. దీంతో మళ్లీ ఈకేసు ట్రాక్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇన్ని సంవత్సరాలు గడిచినా.. దిలీప్ కుమార్ కు శిక్ష పడకపోవడం చాలా అనుమానాలకు తావిస్తోంది. అయితే సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే.. ఆరోపణలు కూడా దిలీప్ కుమార్ పై ఉన్నాయి.































