Shaakunthalam: గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించినటువంటి మొట్టమొదటి పౌరాణిక చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.అయితే ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం మొత్తం ముంబైలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ ఈ సినిమాలో నటీనటులు ఉపయోగించిన నగలు అన్నీ కూడా స్వచ్ఛమైన బంగారు వజ్రాభరణాలనీ తెలిపారు. ఎన్టీఆర్ నటించిన దానవీరశూరకర్ణ సినిమాలో ఆయన బంగారు కిరీటం ధరించారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా ఈ సినిమాలో నటీనటులకు బంగారు నగలను తయారు చేయించామని తెలిపారు.
ఇక ఈ సినిమా కోసం ప్రముఖ నగల డిజైనర్ నీతు లుల్లా
ఆధ్వర్యంలో హైదరాబాద్ కి చెందిన వసుంధర జ్యువెలర్స్ సమక్షంలో సుమారు 7 నెలల పాటు నగలను తయారు చేయించామని తెలిపారు.ఇందులో సమంత 14 రకాల నగలను ధరించారు. ఈమె కోసం సుమారు 15 కిలోల బంగారు నగలను తయారు చేయించామని తెలిపారు. ఇక దుష్యంతుడి పాత్రలో నటించిన దేవ్ మోహన్ కూడా సుమారు 10 కిలోల బంగారు నగలను ధరించినట్లు తెలిపారు.

Shaakunthalam: 14 కోట్ల ఖర్చు చేసిన మేకర్స్…
ఇలా ఈ సినిమాలో నటీనటులకు తయారు చేయించిన నగలకు సుమారు 14 కోట్ల వరకు ఖర్చు చేసిన్నట్లు డైరెక్టర్ గుణశేఖర్ వెల్లడించారు.ఇలా నగల కోసం 14 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలియడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో సమంత, దేవ్ మోహన్ ధరించిన నగలను హైదరాబాద్ వసుంధర జ్యువెలర్స్ లో ఆవిష్కరించారని గుణశేఖర్ తెలియజేశారు



























