Shahrukh Khan: ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో బాలీవుడ్ సౌత్ ఇండస్ట్రీ అంటూ విభేదాలు ఉండేవి అయితే ప్రస్తుతం మాత్రం చిత్ర పరిశ్రమలో బాలీవుడ్ టాలీవుడ్ అంటూ విభేదాలు లేకుండా హీరోలందరూ కూడా ఎంతో మంచి సఖ్యతతో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఒక హీరో సినిమా కోసం మరొక హీరోలు సహాయం చేయడం వారి సినిమాలను ప్రమోట్ చేయడం చేస్తుంటారు.

ఇలా బాలీవుడ్ హీరోలకు టాలీవుడ్ హీరోలకు మధ్య మంచి స్నేహబంధం ఉందనే విషయం మనకు తెలిసిందే. ఇక బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ రామ్ చరణ్ మధ్య కూడా అలాంటి బంధమే ఉందని చెప్పాలి. షారుక్ ఖాన్ దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం పఠాన్. ఈ సినిమా జనవరి 25వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా పఠాన్ సినిమా ట్రైలర్ లాంచ్ కావడంతో ఈ సినిమా ట్రైలర్ ను తెలుగులో రామ్ చరణ్ తమిళంలో విజయ్ దళపతి విడుదల చేశారు.ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవడంతో నటుడు షారుఖ్ ఖాన్ హీరో విజయ్ రామ్ చరణ్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Shahrukh Khan: ఆస్కార్ ను తాకనివ్వండి
ఇక రామ్ చరణ్ కు షారుక్ ఖాన్ ట్వీట్ చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన RRRసినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ సంపాదించుకొని ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షారుక్ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ మీ సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకొని ఇంటికి వచ్చిన తర్వాత నన్ను కూడా ఒకసారి ఆ అవార్డును టచ్ చేయనివ్వండి లవ్ యు అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.































