ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్ మాఫియా స్టార్ సెలబ్రిటీల మెడకు చుట్టుకుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి, పలుమార్లు విచారణకు హాజరు అవుతున్నారు. ఇదిలా ఉండగా క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ జరుగుతున్న విషయం తెలుసుకున్న అధికారులు షిప్ పై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడులలో భాగంగా ఈ క్రూయిజర్ షిప్ లో నటుడు షారుక్ ఖాన్ ఉండటం సంచలనంగా మారింది.

ఈ క్రమంలోనే అధికారులు షారుక్ కొడుకు ఆర్యన్ అధికారులు కస్టడీలోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తన కొడుకు గురించి గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షారుక్ ఖాన్ తన కొడుకు గురించి మాట్లాడుతూ నా కొడుకు అమ్మాయిలతో డేటింగ్ చేయవచ్చు, సిగిరెట్ తాగొచ్చు,సెక్స్, డ్రగ్స్‌ని కూడా తీసుకోవచ్చు. వాడు అన్ని రకాలుగా తన లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అంటూ గతంలో షారుక్ ఖాన్ ఎంతో సరదాగా తన కొడుకు గురించి మాట్లాడాడు.
యవ్వనంలో తను అనుభవించని సరదాల్ని తన కొడుకు అనుభవించాలని చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షారుఖ్ ఖాన్ చెప్పిన విధంగానే తన కొడుకు ఆర్యన్ ను డ్రగ్స్ కేసులో NCB అధికారులు కస్టడీలోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ తో పాటు మరో ఎనిమిదిగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి గతంలో షారుక్ సరదాగా అన్న మాటలను తన కొడుకు నిజం చేసి చూపించాడు.
In a talk show of Simi Grewal about Aryan Khan in 1997, Shahrukh Khan jokingly said:
— Ashutosh Dubey – आशुतोष दुबे ???????? (@AdvAshutoshBJP) October 3, 2021
• That his son should date girls, also enjoy drugs.
• He becomes a bad boy and if he looks like a good boy they will throw him out of the house.pic.twitter.com/okZ88BNM9Z
ఇకపోతే ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి ఈ వార్త సంచలనంగా మారింది. క్రూయిజర్ షిప్ లో పార్టీ జరుగుతుందని తెలుసుకున్న అధికారులు ఉన్నఫలంగా దాడులు చేసి అందులో డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇకపోతే కేసుకు సంబంధించి పూర్తి వివరాలను అధికారులు త్వరలోనే తెలియజేయనున్నట్లు సమాచారం.




























