Shakalaka Shankar: సాధారణంగా ఒక సినిమా ఈవెంట్ జరిగినా లేదా సోషల్ మీడియా వేదిక అయినా ఏదైనా మాట్లాడే ముందు లేదా పోస్ట్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడటం ఎంతో మంచిది పొరపాటున కూడా ఏదైనా అనరాని మాట అన్న నోరు జారిన పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రస్తుతం అలాంటి వివాదాలను ఎదుర్కొంటున్నారు జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్.

షకలక శంకర్ రాజయోగం థాంక్స్ మీట్ లో భాగంగా బండ్ల గణేష్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ హీరోలను వాడు వీడు అంటూ సంబోధించాడు. అయితే షకలక శంకర్ ఎవరిని అన్నారనే విషయం గురించి ఆరా తీస్తే… రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.కొందరు రెండు మూడేళ్లు ఇండస్ట్రీలో ట్రై చేసి అదృష్టం రావడంతో సూపర్ స్టార్లు మెగాస్టార్లు అవుతారు కానీ రవితేజ మాత్రం చాలా కష్టపడి పైకి వచ్చారంటూ కామెంట్లు ఇచ్చేశారు.
ఇకపోతే అదృష్టం కొద్ది మెగాస్టార్లు సూపర్ స్టార్లు అవుతారు అని బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలపై షకలక శంకర్ స్పందిస్తూ…అదృష్టం ఉంటేనే సూపర్ స్టార్లు మెగాస్టార్లు కారు రాత్రి పగలు కష్టపడితేనే అలాంటి హోదా దక్కుతుంది ముందు ఎవడో హీరో ఉన్నాడు కదా అని వాడు ఉబ్బి పోవాలని మాట్లాడకూడదు అంటూ బండ్ల గణేష్ పై విరుచుకుపడ్డారు. అయితే బండ్ల గణేష్ ముందున్న హీరో రవితేజ కావడంతో రవితేజ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా షకలక శంకర్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

Shakalaka Shankar: ఫ్లోలో నోరు జారాను క్షమించండి…
ఇలా నేటిజన్స్ దెబ్బకు దిగివచ్చిన షకలక శంకర్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. దీంట్లో ఈయన రవితేజకు క్షమాపణలు తెలియజేశారు. ఫ్లోలో మిమ్మల్ని వాడు వీడు అనేసాను వీలైతే క్షమించండి… రవితేజ అభిమానులకు థాంక్స్ అంటూ ఈయన చెప్పకు వచ్చారు. ప్రస్తుతం షకలక శంకర్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





























