Connect with us

Featured

Shalini Pandey: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అర్జున్ రెడ్డి హీరోయిన్.. ఇలా తయారయ్యిందేంటీ?

Shalini Pandey: షాలిని పాండే అంటే టక్కున గుర్తు రాకపోయినా అర్జున్ రెడ్డి హీరోయిన్ అంటే అందరికీ ప్రీతి పాత్రలో నటించిన ఈ హీరోయిన్ టక్కున

Published

on

Shalini Pandey: షాలిని పాండే అంటే టక్కున గుర్తు రాకపోయినా అర్జున్ రెడ్డి హీరోయిన్ అంటే అందరికీ ప్రీతి పాత్రలో నటించిన ఈ హీరోయిన్ టక్కున గుర్తుకు వస్తారు.సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన నటించిన షాలిని పాండే మొదటి సినిమాతోనే ఎంతో మంది యువతను ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఈమె ఒక్కసారిగా యువతలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.

Shalini Pandey: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అర్జున్ రెడ్డి హీరోయిన్.. ఇలా తయారయ్యిందేంటీ?
Shalini Pandey: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అర్జున్ రెడ్డి హీరోయిన్.. ఇలా తయారయ్యిందేంటీ?

ముఖ్యంగా విజయ్ దేవరకొండతో కలిసి ఈమె ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతో అద్భుతంగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో ఈ లిప్ లాక్ సన్నివేశాలతో యువతను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా విడుదలకు ముందు వరకు ఏ విధమైనటువంటి అంచనాలు లేకపోయినా ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి షోతోనే అద్భుతమైన హిట్ సొంతం చేసుకుంది.

Shalini Pandey: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అర్జున్ రెడ్డి హీరోయిన్.. ఇలా తయారయ్యిందేంటీ?
Shalini Pandey: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అర్జున్ రెడ్డి హీరోయిన్.. ఇలా తయారయ్యిందేంటీ?

ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ యువతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారడమే కాకుండా ఎంతో మంది అమ్మాయిలకు క్రష్ అయ్యారు.ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుస సినిమా అవకాశాలను అందుకోని ఏకంగా పాన్ ఇండియా సినిమాలలో నటించే స్థాయికి వెళ్లారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ టాప్ హీరోగా కొనసాగుతున్నారు.

సన్నజాజి తీగలా మారిపోయిన షాలిని…

ఇక అందరిలాగే షాలిని పాండే కూడా మొదటి సినిమాతోనే యువతను ఎంతో ఆకట్టుకోవడంతో ఈమెకు కూడా వరుస అవకాశాలు వస్తాయని భావించారు.అయితే ఈమె అనుకున్న విధంగా తనకు ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవకాశాలు రాలేదు.కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో ఓ కీలక పాత్రలో షాలిని నటించినప్పటికీ ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో తెలుగు సినిమాలకు దూరమైన షాలిని బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.అర్జున్ రెడ్డి సినిమాలో ఎంతో బొద్దుగా ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సన్నజాజి తీగల మారిపోయారు. ఈ క్రమంలోని ఈమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అసలు అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన షాలినినేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Featured

YS Jagan: లండన్ నుంచి తిరిగి వచ్చిన వైయస్ జగన్.. ముఖ్య నేతలతో కీలక భేటీ?

Published

on

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు పూర్తి అయిన తర్వాత తన ఫ్యామిలీతో కలిసి లండన్ పర్యటన వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. మే 13వ తేదీ ఎన్నికలు పూర్తికాగా 17వ తేదీ ఈయన లండన్ వెళ్లారు. అయితే నేడు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు.

ఈయన లండన్ పర్యటన పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన నేపథ్యంలో పలువురు కీలక నేతలు విమానాశ్రయంలోనే జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక జగన్ లండన్ పర్యటన నుంచి నేరుగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు.

గత రెండు వారాలుగా ఆంధ్రప్రదేశ్ కి దూరంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తిరిగి రావడంతో వెంటనే ఈయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసిపి కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఎన్నికల ఫలితాలపై కొన్ని దిశా నిర్దేశాలు చేశారని తెలుస్తోంది.

Advertisement

మరి కొన్ని గంటలలో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్న నేపథ్యంలో జగన్ ముఖ్య నేతలతో ఈ భేటీ నిర్వహించారు. అయితే ఇప్పటికే పలు సంస్థలతో సర్వేలు చేయించినటువంటి ఈయన ఈసారి కూడా తమకే అనుకూలంగా ఉందని తను లండన్ వెళ్ళటానికి ముందే వచ్చేది మన ప్రభుత్వమే అని తెలియజేశారు.

వచ్చేది వైసీపీనే…
పలు సర్వేలు వెల్లడించిన ఫలితాలలో 2019 ఎన్నికల సమయంలో వచ్చినటువంటి సీట్ల కంటే మరికొన్ని ఎక్కువగానే రాబోతున్నాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల కౌంటింగ్ రోజు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఘటనలు అల్లర్లు చోటు చేసుకోకుండా ఉండాలని ఈయన నేతలకు సలహాలు సూచనలు ఇచ్చారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

AP Election Result: అందరి చూపు ఆంధ్ర పైనే.. ఫలితాలు ఎవరికీ అనుకూలం?

Published

on

AP Election Result: రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ కూడా జూన్ నాల్గవ తేదీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మే 13వ తేదీ ఏపీ ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ రాబోతున్న నేపథ్యంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇక కూటమి అధికారంలోకి రాబోతుందని కూటమి నేతలు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీనే తిరిగి అధికారంలోకి రాబోతుందని వైసిపి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేయడమే కాకుండా కోట్లలో బెట్టింగులు కూడా కడుతున్నారు.

మరోవైపు జూన్ 9వ తేదీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరగబోతున్నాయని ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారని కూడా చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు తామే అధికారంలోకి రాబోతున్నారని చాలా బలంగా నమ్ముతున్నారు.

Advertisement

అధికారం ఎవరిదీ…
ఇకపోతే ఈసారి జరిగిన పోలింగ్ సరళి చూస్తే అంచనాలు వేయడం కూడా కాస్త కష్ట తరమే అని చెప్పాలి. పోలింగ్ భారీ స్థాయిలో పెరగడం దేనికి సంకేతం అన్న విషయంపై అందరూ అయోమయంలో ఉన్నారు. అయితే నేడు సాయంత్రం పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఈ ఫలితాలపై కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్ కి కాస్త అటు ఇటుగా ఫలితాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Exit Polls: ఉత్కంఠతను రేపుతున్న ఎగ్జిట్ పోల్స్.. ఫలితాలు ఎవరికీ అనుకూలం?

Published

on

Exit Polls: జూన్ నాలుగవ తేదీ ఎన్నికల ఫలితాలు వెలబడనున్న నేపథ్యంలోనే అందరి ఆసక్తి ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మే 13వ తేదీ ఈ ఎన్నికలు జరిగాయి. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో నేటి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆధారంగానే అన్ని రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి.

ఈ క్రమంలోనే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఏపీ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠత భరితంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఫలితాలు శనివారం సాయంత్రం 6 గంటలకు వెలబడుతున్నాయి. ఇక ఎన్నికల విషయానికి వస్తే ఎప్పుడూ లేనివిధంగా ఏపీలో ఈసారి భారీ స్థాయిలో పోలింగ్ జరిగింది. పెరిగిన ఈ పోలింగ్ శాతం తమకు అనుకూలంగా మారుతుందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సంక్షేమ పథకాలు తమ ఐదేళ్ల పరిపాలన ప్రజలకు నచ్చే స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి ముందుకు వచ్చారని సంక్షేమ పథకాలే తిరిగి మమ్మల్ని అధికారంలో కూర్చోబెడతాయని వైసిపి నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరికివారు తామే అధికారంలోకి రాబోతున్నారని చెబుతున్నారు మరోవైపు ఎన్నికలు కూడా వార్ వన్ సైడ్ అనే లాగా జరగలేదు.

Advertisement

ఎవరిది అధికారం..
ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఎవరికి అనుకూలంగా మారాయి.. ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే విషయాలపై ఎంతో ఆత్రుత నెలకొంది. ఇక ఇప్పటికే ఎన్నో సంస్థలు సర్వేలు చేయగా అన్ని సర్వేలలోనూ వైసీపీకే అధికారం ఉందని చెబుతున్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు అనేది ఎదురు చూడాలి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!