Shanthi Srihari: టాలీవుడ్ షేర్ ఖాన్ శ్రీహరి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈయన హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇక నటుడిగా ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకొని దూసుకుపోతున్న శ్రీహరి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మృతి చెందారు. ఇక ఈయన మరణించడంతో ఈయన భార్య డిస్కో శాంతి తన పిల్లల బాగోగులు చూసుకుంటూ జీవితంలో ముందుకు వెళుతున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె శ్రీహరి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.శ్రీహరికి సినిమాలంటే ఎంతో పిచ్చి ఆ పిచ్చితోనే డబ్బులు ఇవ్వకపోయినా ఎన్నో సినిమాలలో నటించారని అయితే ఇదే అదునుగా భావించి చాలామంది తనకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఈమె ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
ఇలా శ్రీహరి ఎన్నో సినిమాలలో చేసినప్పటికీ చాలామంది డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులే కనుక ఇచ్చి ఉంటే తాను ఇంకో పది ఇల్లు కొనేదాన్ని అంటూ ఈమె షాకింగ్ కామెంట్ చేశారు. ఇక ఆయన మరణించిన తర్వాత అప్పులు ఉండడంతో తాను తన కార్లు నగలు అన్ని అమ్మి అప్పులు తీర్చానని తెలిపారు. ఆయన చనిపోయే సమయానికి ఆయన నటించిన సినిమాలు విడుదలయ్యాయి అయితే ఏ ఒకరు కూడా శ్రీహరికి రావాల్సిన పేమెంట్ ఇవ్వలేదని తెలిపారు.

Shanthi Srihari: బాలకృష్ణ మాత్రమే పరామర్శించారు..
ఇకపోతే శ్రీహరి మరణానికి ముందు బాలకృష్ణ గారి సినిమాలో నటించారు. ఈ క్రమంలోనే ఆయన మరణం తర్వాత బాలకృష్ణ ఫోన్ చేసి తన సినిమాలో నటించినందుకు ఏవైనా బ్యాలెన్స్ ఉంటే తప్పకుండా చెల్లిస్తామని అలాగే ఏదైనా సహాయం కావాలంటే అడగమని బాలకృష్ణ తనకు ఫోన్ చేసే పరామర్శించారు. ఆయన తప్ప మిగిలిన ఏ ఒక్కరూ తమని పరామర్శించలేదని ఈ సందర్భంగా శాంతి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
































