Shehnaz Gill: బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ షో లలో బిగ్ బాస్ రియాలిటీ షో కి విపరీతమైన ఆదరణ వచ్చింది.హాలీవుడ్ లో ప్రసారమైన ఈ కార్యక్రమానికి ఇండియాలో ఎంతో మంచి ఆదరణ వచ్చిందని చెప్పాలి.ఇలా ఇండియాలో పలు భాషలలో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం తెలుగులో కూడా ఐదు సీజన్లను పూర్తిచేసుకుని ఆరవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది.

ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఇకపోతే హిందీ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న సెలబ్రిటీలకు కాస్త డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఇలా హిందీ బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా పాల్గొన్నటువంటి నటి షెహనాజ్ గిల్ గురించి అందరికీ తెలిసిందే.ప్రవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకుంది.

తాజాగా ఈమె మసాబా మసాబా’ వెబ్ సిరీస్ సీజన్ 2 ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇకపోతే ఈ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మకు నెటిజన్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.తనని పెళ్లి చేసుకోమంటూ నేటిజెన్ నుంచి ప్రపోజల్ రావడంతో ఈమె ఆ ప్రపోజల్ కి ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. నన్ను పెళ్లి చేసుకొని నాతో ఉండాలంటే చాలా కష్టమని సమాధానం చెప్పారు.
నేను చెప్పేది మాత్రమే వినాలి..
ఇక మీరు ప్రపోజల్ పెట్టడంతో పాటు మీ బయోడేటా నాకు పంపండి. నాతో ఉండడం అంత సులువు కాదు నాకు ఎదుటివారు చెబితే వినే అంత ఓపిక సహనం నాకు లేదు ఎప్పుడూ కూడా నేను మాట్లాడినదే ఇతరులు వినాలి. నేను 24 గంటల పాటు విరామం లేకుండా మాట్లాడుతూనే ఉంటాను. అయితే నా మాటలు వింటూ మధ్య మధ్యలో నా గురించి చెబుతూ ఉండాలి. ఇక నాకు ఇతరులు నచ్చకపోతే మధ్యలోనే వెళ్లిపోతాను నాతో ఉండడం అంత సులువు కాదంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ab saare aao, Aur mere sangg naacho… watch me perform at Umang on 6th Aug at 9:30pm on @SonyTV pic.twitter.com/W3SfLtS17p
— Shehnaaz Gill (@ishehnaaz_gill) July 28, 2022

































