శేఖర్ మాస్టర్ తో పొట్టి స్కర్ట్ లో రచ్చ రచ్చ చేసిన శ్రీముఖి!

0
100

బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి. ఈమె పరిచయం గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరలో పలు షో లలో యాంకరింగ్ చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు అందుకుంది. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది శ్రీముఖి. ఇక యాంకరింగ్ తో మాత్రం బాగా సందడి చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. పైగా తనకు ఉన్న ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు.

యాంకర్ రవితో కలిసి పటాస్ షో తో మంచి గుర్తింపు అందుకుంది. ఇక రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా పాల్గొని చివరి వరకు తన ఆటతో బాగా మెప్పించింది. ఇక చివరిలో రన్నరప్ గా నిలిచింది. వెండితెరపై నటించిన శ్రీముఖికి అంతగా గుర్తింపు రాలేదు కానీ బుల్లి తెరపై మాత్రం మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఖాళీ సమయాలలో ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తుంది. తెగ ట్రిప్పులు కూడా చేస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతుంది. ఇక ఈ మధ్య తన ఇన్ స్టా వేదికగా ఫన్నీ వీడియోలతో తెగ నవ్విస్తుంది. అంతేకాకుండా డాన్స్ స్టెప్పులతో కూడా బాగా సందడి చేస్తుంది. ఇక పొట్టి పొట్టి బట్టలతో యువతను కళ్లార్పకుండా చేస్తుంది. తాజాగా శేఖర్ మాస్టర్ తో కలిసి స్టెప్పులు వేయగా ఆ డాన్స్ వీడియోను తన ఇన్ స్టా వేదికగా అభిమానులకు పంచుకుంది.

ఈ మధ్య ఇన్ స్టా లో బాగా వైరల్ గా మారిన తమిళ పాటకు శేఖర్ మాస్టర్ తో కలిసి డాన్స్ చేసింది. పొట్టి స్కర్ట్ ధరించి బాగా అదరగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. పైగా దీనికి సాంగ్ అంత బాగా రాకపోయి ఉండవచ్చని క్యాప్షన్ కూడా ఇవ్వగా ఈ వీడియోని చూసి నెటిజనులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here