బాలీవుడ్ ఇండస్ట్రీలో గత వారం రోజుల నుంచి ఫోర్న్ రాకెట్ కేసు తీవ్ర సంచలనం రేపుతోంది. రోజురోజుకు ఈ కేసులో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే క్రైమ్ బ్రాంచ్, సైబర్ సెల్, విభాగాలు వివిధ కోణాలలో ఈ కేసును దర్యాప్తు చేస్తూ ఒక్కొక్కటిగా బయటపేడుతున్నారు. తాజాగా ఈ కేసులో రాజ్ కుంద్రా భార్య సినీ నటి శిల్పాశెట్టిని కూడా విచారించాలని భావిస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు కేవలం రాజ్ కుంద్రాను మాత్రమే విచారించిన పోలీసులు ఇప్పుడు వారి దృష్టిని శిల్పాశెట్టి పైకి మరలించారు. నిన్నటి వరకు ఈ కేసు విషయంలో శిల్పాశెట్టికి ఏమాత్రం సంబంధం లేదని మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు స్పష్టం చేశారు. కానీ గతంలో శిల్పా శెట్టి జేఎల్ స్ట్రీమ్ సమస్థకి సంబంధించిన వెబ్ సైట్ కు ప్రచారకర్తగా వ్యవహరించారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ కంపెనీలో ఫోర్న్ రాకెట్ జరుగుతుందని ఆరోపణలు రావడం చేత పోలీసులు శిల్పాశెట్టి పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించడం వల్లే ఇప్పుడు ఈ వ్యవహారంలో శిల్పాశెట్టి పాత్ర ఉంటుందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ కంపెనీకు,శిల్పాశెట్టికి ఉన్న సంబంధాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.అలాగే రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన తర్వాత మీడియాకు దూరంగా ఉంటున్న శిల్పాశెట్టి శుక్రవారం తన భర్త గురించి భావోద్వేగమైన పోస్ట్ చేయడం విశేషం. ఈ విధంగా శిల్పాశెట్టిపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో ఆమెను కూడా విచారించాలని భావించడంతో ఈ విషయం బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది.


























