Big Boss Non Stop: బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం ప్రేక్షకులను మరింత సందడి చేస్తోంది. ఇప్పటికే మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా ముమైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ కి వెళ్లిన యాంకర్ శివ అందరితో పులిహోర కలవడానికి ప్రయత్నాలు చేస్తూ పులిహోర రాజగా పేరు సంపాదించుకున్నారు.

ఇదిలా ఉండగా గత ఎపిసోడ్ లో భాగంగా యాంకర్ శివ బోల్డ్ బ్యూటీ అరియాన ఇద్దరు కలిసి పనిష్మెంట్ గురించి మాట్లాడుతూ కూర్చున్నారు. ఈ సందర్భంలోనే అరియాన ఒకవేళ నాకు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే ఎలాంటి పనిష్మెంట్ ఇస్తావు అంటూ శివని అడిగింది. దీంతో శివ నా ఒళ్లో కూర్చుని ఇక్కడ ముద్దు పెట్టమని చెబుతాను అంటూ చెప్పాడు.

ఈ మాట విన్న అరియాన తలకాయ పగిలిపోతుంది అంటూ సమాధానం చెప్పింది. పనిష్మెంట్ అన్న తర్వాత తప్పకుండా చేయాలి నేను కూడా నీ ఒళ్లో కూర్చుని ముద్దు పెడతాను అంటూ శివ సమాధానం చెప్పడంతో వెంటనే అరియాన ఒళ్ళు తిమ్మిరిగా ఉందా అంటూ తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. లేదు వళ్ళు బాగానే ఉంది ముద్దు పెట్టు అంటూ అనడంతో అరియాన తనదైన శైలిలో యాంకర్ శివకు పంచ్ వేసింది.
తమ్ముడు అంటూ పంచ్…
అయినా నేను తమ్ముళ్లకు ముద్దు పెట్టను బ్రో… అంటూ పులిహోర రాజా ఫ్యూజులు ఎగిరిపోయే పంచ్ వేసింది. ఈ మాట విన్న యాంకర్ శివకు ఒక్కసారిగా దిమ్మతిరిగిపోయింది. పలు ఇంటర్వ్యూల ద్వారా ఎంతోమందిని బోల్డ్ ప్రశ్నలడుగుతూ ఇబ్బంది పెట్టే శివ పప్పులు మన బోల్డ్ బ్యూటీ అరియాన దగ్గర ఏ మాత్రం ఉడకలేదని చెప్పాలి.































