కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికే ఆయన లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. తమ్ముడు మరణాన్ని అన్నా శివరాజకుమార్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ కుమార్ చనిపోయి ఇన్ని రోజుల తర్వాత తన అన్న శివరాజ్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను గురించి చర్చించారు.

శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. పునీత్ మరణంతో అతని కుటుంబంలో నెలకొన్న పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ గురించి కూడా శివరాజ్ ప్రస్తావించారు.పునీత్ చనిపోయిన రోజు అతని పార్ధివ దేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన ఎన్టీఆర్ శివ రాజ్ కుమార్ వద్దకు వచ్చి నేను ఉన్న అన్నా మీకు అంత ధైర్యంగా ఉండండి అన్నారని తెలిపాడు.
అనంతరం ఎన్టీఆర్ పై తనకున్న అనుబంధం మరియు అభిమానం గురించి శివరాజ్ కుమార్ తెలియజేశారు. ఇక పునీత్ మరణవార్త విన్న అనంతరం ఎన్టీఆర్ బెంగళూరుకి వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఆ సమయంలో పునీత్ మృతదేహం చూసిన ఎన్టీఆర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. అప్పుడు పునీత్ అన్న శివరాజ్ కుమార్ ను ఎన్టీఆర్ ఓదార్చాడు.
"నేనున్నాను అన్నా మీకు" – ఎన్.టి.ఆర్
— MilagRRRo Movies ( Radhe Shyam ) (@MilagroMovies) November 11, 2021
శివరాజ్ కుమార్ @NimmaShivanna
గారిని పరామర్శించిన ఎన్.టి.ఆర్@tarak9999 @PuneethRajkumar pic.twitter.com/Qijeqlagc9
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కన్నడ సినిమా ఇండస్ట్రీతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. పునీత్ కోసం ఎన్టీఆర్ ఒక పాటను కూడా కన్నడంలో పాడి అక్కడి వారిని తన గొంతుతో ఆకట్టుకున్నాడు.ఈ పాట తరువాత ఎన్టీఆర్ పునీత్ ల మధ్య బంధం మరింతగా పెరిగింది అని చెప్పుకొచ్చాడు శివ రాజ్ కుమార్. మొత్తానికి పునీత్ రాజ్ కుమార్ మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు.


































