Shivabalaji -Madhumitha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యమైన జంటగా గుర్తింపు పొందిన శివ బాలాజీ మధుమిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ఇంగ్లీష్ కారన్ ‘ అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఇలా ఇద్దరు కూడా నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.

ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకొని ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొందారు. ఇద్దరూ కూడా ఎన్నో సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటించారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ కూడా సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తమ వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరిద్దరూ తమ ప్రేమ పెళ్లి వరకు రావడానికి ఎదురైన ఆటంకాల గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ఈ క్రమంలో మధుమిత మాట్లాడుతూ ..” శివ బాలాజీ నాలుగేళ్ల పాటు నన్ను ప్రేమించి తీరా పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత నాకు బ్రేకప్ చెప్పాడు అని తెలిపింది. ఇరు కుటుంబాలు పెళ్ళికి అంగీకరించిన తర్వాత ఒకరోజు శివ బాలాజీ ఫోన్ చేసి.. మన జాతకాలు కలవలేదు . నిన్ను పెళ్లి చేసుకుంటే మా అమ్మ చనిపోతుంది. అందుకే నిన్ను పెళ్ళి చేసుకోలేని చెప్పాడు.

Shivabalaji -Madhumitha: అమ్మ చనిపోతుందని వద్దన్నారు…
ఆ క్షణంలో గుండెలు పగిలేలా ఏడ్చాను అంటూ మధుబాల తెలిపింది. మనం ఫ్రెండ్స్ లాగా ఉందామని శివ బాలాజీ అడిగినా కూడా నేను నో చెప్పాను ఎందుకంటే నేను అతన్ని భర్తగా మాత్రమే ఊహించుకున్నాను. మా అమ్మ నాన్నలకు జాతకాల గురించి పట్టించుకోలేకపోయినా కూడా అత్తమ్మ వాళ్ళు జాతకాలను చాలా నమ్ముతారని తెలిపింది. ఆ తర్వాత ఒకటిన్నర సంవత్సరానికి మల్లి బాలాజీ తన తల్లిదండ్రులను ఒప్పించి నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటూ చెప్పుకొచ్చింది.