Shoaib Malik: షోయబ్ మాలిక్, సానియా మీర్జా ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే సానియా మీర్జా షోయబ్ మాలిక్ కి విడాకులు ఇవ్వడానికి గల కారణం ఆయనకు మరొకరితో ఉన్న సంబంధమేనని తెలుస్తుంది.

తాజాగా పాక్ మోడల్ ఆయేషా ఒమర్ అనే మోడల్ తో రిలేషన్ లో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే ఈమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా షోయబ్ తో ఎంత చనువుగా ఉన్న ఫోటోలను షేర్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని ఈమెతో రిలేషన్ కారణంగానే వీరిద్దరూ విడాకులకు కూడా సిద్ధమయ్యారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే పాకిస్థాన్ మోడల్ ఆయేషా ఒమర్ తో కలిసి ఎంతో చనువుగా దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. అయితే వీరిద్దరూ కలిసి ఒక మ్యాగజైన్ కోసం ఫోటోలు దిగారని తెలుస్తుంది. ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం షోయబ్ మాలిక్ మోడల్ తో కలిసి
హెల్త్ అంట్ ఫిట్ నెస్ పై అవగాహనలో భాగంగా ఈ షూట్ జరిగింది.

Shoaib Malik: మ్యాగజైన్ కోసం ఫోటో షూట్…
ఈ ఫోటో షూట్ లో ఈమె క్రికెటర్ తో కలిసి ఎంతో బోల్డ్ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ప్రస్తుతం ఈమె విడాకులు గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఫోటోలు వైరల్ కావడంతో నిజంగానే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారను వార్తలు షికార్లు చేస్తున్నాయి.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.






























