ఈ మధ్య కాలంలో కొత్తగా పెళ్లైన మహిళలు కెరీర్ లో స్థిరపడాలని, వివిధ కారణాల వల్ల బర్త్ కంట్రోల్ పిల్స్ ను ఎక్కువగా వాడుతున్నారు. మరి బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం మంచిదేనా..? ఈ పిల్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా..? అనే ప్రశ్నకు వైద్య నిపుణులు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడట్ం మంచి కాదని చెబుతున్నారు. ఈ పిల్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని.. భవిష్యత్తులో అనేక ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

బర్త్ కంట్రోల్ పిల్స్ వాడాలనుకుంటే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. బర్త్ కంట్రోల్ పిల్స్ ఎక్కువగా వాడితే శరీరంలో విటమిన్ల లోపం, మినరల్స్ సమస్యలు ఏర్పడతాయని.. గతంలో బర్త్ కంట్రోల్ పిల్స్ ఉపయోగించి ఉంటే డ్రై ఫ్రూట్స్, పండ్లు , స్వీట్లు, నాన్ వెజ్, పాలు, బ్రెడ్, తృణధాన్యాలు, వెజిటేబుల్స్ తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. పిల్స్ వాడే వాళ్లలో మనసిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని చెబుతున్నారు.
బర్త్ కంట్రోల్ పిల్స్ అధిక బరువు సమస్య బారిన పడటానికి కారణమవుతాయని.. ప్రతి రోజూ యోగా, మెడిటేషన్, వ్యాయామం చేయడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చని తెలుపుతున్నారు. కొన్ని సందర్భాల్లో బర్త్ కంట్రోల్ పిల్స్ ఓవర్ డోస్ కావడం వల్ల సమస్యలు వస్తాయని.. అందువల్ల పిల్లలు ఆలస్యంగా కనాలనుకుంటే వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
ఈ పిల్స్ వల్ల కాలేయం పనితీరు సైతం మందగిస్తుందని.. హార్మోన్ల జీవక్రియ ప్రక్రియ చేపట్టే కాలేయంలో సమస్యలు ఎదురైతే ఆ ప్రభావం ఇతర అవయవాలపై కూడా పడుతుందని వైద్యులు చెబుతున్నారు. పిల్స్ ఎక్కువగా వాడిన వాళ్లు తులసి టీని ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.




























