Shruthi Hassan: శృతిహాసన్ సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ చిరంజీవి నటించిన సినిమాలలో నటించి ఒకేసారి సంక్రాంతి బరిలో రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.బాలకృష్ణ సరసన నటించిన వీర సింహారెడ్డి చిరంజీవి సరసన నటించిన వాల్తేరు వీరయ్య రెండు సినిమాలలోని శృతిహాసన్ హీరోయిన్ గా నటించడం విశేషం.

ఇక విశాఖపట్నంలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి హీరోయిన్ శృతిహాసన్ డుమ్మా కొట్టారు.ఇలా ఈమె వీరసింహారెడ్డి ఫంక్షన్ కి హాజరై వాల్తేరు వీరయ్యకు మాత్రం హ్యాండ్ ఇవ్వడంతో అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేశారు. అయితే శృతిహాసన్ ఈ ఈవెంట్ కిరాకపోవడానికి గల కారణాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తనకు ఆరోగ్యం బాగాలేదని అయితే అది కోవిడ్ కాకుండా ఉండడాలని దేవుని ప్రార్థిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. మరొక స్టోరీలో తనకు పూర్తిగా అనారోగ్యంగా ఉందని, అందుకే వాల్తేరు వీరయ్య సినిమా ఈ వెంట్ కు తాను హాజరు కాలేకపోతున్నానని తెలిపారు.

Shruthi Hassan: ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…
చిరంజీవి గారితో ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం అయితే అనారోగ్యం కారణంగా ఈ వేడుకకు రాలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది.ఇక ఈ వేడుకను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని ఈమె సోషల్ మీడియా వేదికగా తాను ఈ కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణాలను తెలియజేశారు. ప్రస్తుతం శృతిహాసన్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
































