Shyam Sigha Roy: డిసెంబర్ నెలలో తెలుగులో మంచి సినిమాలు విడుదల అయ్యాయి. అందులో స్టార్ హీరోల దగ్గర నుంచి.. చిన్న హీరోల వరకు ప్రతీ సినిమా థియేటర్లలో విడుదల అయ్యాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేసుకున్నారు. అయితే ఎన్నో అంచనాల మధ్య డిసెబర్ 17 పుష్ప పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయి.. మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

అయితే పుష్ప సినిమా ద్వారా ఏమైనా ఇబ్బంది అవుతాందా..అని ఆలోచించకుండా.. తన కథపై నమ్మకంతో క్రిస్మస్ కు ఒకరోజు ముందు థియేటర్లలోకి వచ్చిన సినిమా శ్యామ్ సింగరాయ్. దీనిలో నానీ హీరోగా.. డబుల్ రోల్ ప్లే చేశాడు. ఉప్పెన్ ఫేమ్ హీరోయిన్ కృతి శెట్టి , మడోన్నా సెబాస్టియన్ మరియు సాయి పల్లవి హీరోయిన్లుగా నటించారు.

అయితే ఈ సినిమా అనుకున్నట్లుగానే పాన్ ఇండియా లెవల్ లో విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతోంది. విడుదల అయిన ప్రతీ సెంటర్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తమ కథపై నమ్మకంతో విడుదల చేసిన ఈ సినిమా అనుకున్నట్లుగానే హిట్ టాక్ తెచ్చుకుంది.
త్వరలోనే సీక్వెల్ ప్లాన్..
అయితే ఈ సినిమాకు సంకృత్యాన్ దర్శకత్వం వహించని విషయం తెలిసిందే. అయితే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని.. దానిని దర్శకుడు ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్యామ్ సింగరాయ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. దీనిలో నాని, వెంకట్ బోయినపల్లి చిత్రయూనిట్‌కి షీల్డ్స్‌ను ప్రదానం చేశారు. ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మించిన విషయం తెలిసిందే .































