Siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు సిద్ధార్థ్ ఒకరు. ఈయన బాయ్స్ బొమ్మరిల్లు నువ్వు వస్తానంటే నేనొద్దంటానా వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఈయనకి కూడా తెలుగులో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే తదుపరి సిద్ధార్థ్ నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈయనకు సినిమా అవకాశాలు కాస్త తగ్గిపోయాయని చెప్పాలి.

ఇక ఈయన చివరిగా మహాసముద్రం అనే తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇదిలా ఉండగా త్వరలోనే మిస్ యు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఈ సినిమా నవంబర్ 29వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్లో కూడా ఒక వేడుకలో ఈయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పుష్ప 2సినిమా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మీ సినిమా విడుదలైన వారం రోజులలోనే పుష్ప2 సినిమా విడుదల కాబోతుంది అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి.

Siddarth: సినిమాలన్నీ ఒకటే..
వారం రోజుల వ్యవధిలోనే పుష్ప సినిమా విడుదలయితే నాకేంటి నా దృష్టిలో సినిమాలన్నీ కూడా ఎప్పుడూ ఒకటే. ఎక్కువ బడ్జెట్ పెడితే పెద్ద సినిమాలనే చెబుతారు చిన్న సినిమా అయినా మంచిగా ఉంటే ఏ థియేటర్ నుంచి కూడా తొలగించరంటూ సిద్దార్థ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.































