Hero Siddharth: చేతిలో సినిమాలు లేకున్నా.. వివాదాలతో వార్తల్లో ఉంటున్నారు హీరో సిద్ధార్థ్. ఒకప్పుడు తమిళ, తెలుగు భాషల్లో మంచి క్రేజ్ ఉన్న సిద్ధార్థ్ ప్రస్తుతం సినిమాలు లేకుండా ఖాళీగా ఉంటున్నారు. దీంతో ట్విట్టర్ లో ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రముఖ షెట్లర్ సైనా నెహ్వాల్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హీరో సిద్ధార్థ్ పై దేశ వ్యాప్తంగా మహిళలతో పాటు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైనా నెహ్వాల్ తండ్రి కూడా సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇటీవల సిద్ధార్థ్, సైనా నెహ్వాల్ పై ట్విటర్ వేదికగా అవమానపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి భద్రత కల్పించడంలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలయమైంది. పాకిస్థాన్ బార్డర్ కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు ఓ 20 నిమిషాల పాటు ప్రధాని ఆందోళనకారుల నిరసనలతో చిక్కుకుపోయారు. ఈ ఘటనపై సైనా నెహ్వాల్ ట్విట్టర్ వేదికగా స్పందించింది.దేశ ప్రధాని విషయంలో ఇలా జరగడం దురదృష్టకరం. ప్రధానికే భద్రత లేకుంటే సామాన్య ప్రజల సంగతి ఏంటి? ఈ పరిణామాన్ని ఖండిస్తున్నాను.. అంటూ సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు. ఈ ట్విట్ పై సిద్ధార్థ్ వ్యంగంగా సైనా నెహ్వాల్ ను ఉద్దేశిస్తూ ట్విట్ చేశాడు. ఓ చిన్న కాక్ తో ఆడే ప్రపంచ ఛాంపియన్ అంటూ.. సైనాపై అవమానకర కామెంట్ చేశారు.

ఇప్పటికే ఈ వివాదంపై జాతీయ మహిళ కమిషన్ సీరియస్ అయింది. సైనా పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిద్ధార్థ్ ట్విట్టర్ అకౌంట్ ను బ్యాన్ చేయాలని ట్విట్టర్ ఇండియాకు లేఖ రాసింది. జాతీయ మహిల కమిషన్. సిద్ధార్థ్ పై కేసు నమోదు చేయాలని.. మహారాష్ట్ర డీజీపీని కూడా ఆదేశించింది.
మిమ్మల్ని అవమానించాలనే ఉద్దేశం కాదు..
ఈ వివాదంపై దేశవ్యాప్తంగా వ్యతిరేఖత రావడంతో తన తప్పుదిద్దుకునే పనిలో ఉన్నాడు సిద్ధార్థ్. ట్విట్టర్ వేదికగా సైనాకు క్షమాపణలు చెప్పారు. ఆయన ఓ లెటర్ విడుదల చేశారు. డియర్ సైనా… అది ఒక బ్యాడ్ జోక్. ట్వీట్ ద్వారా మిమ్మల్ని కించపరిచాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. అందరూ ఆపాదిస్తున్నట్లు మీ పట్ల నాకు ఎటువంటి చులకన భావన లేదు. నిన్ను అవమానించాలని ఆ ట్వీట్ చేయలేదు. నేను ఒక జోక్ వేశాను అంటూ వివరణ ఇచ్చారు.
Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY
— Siddharth (@Actor_Siddharth) January 11, 2022































