Siddhu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఈయన నాగచైతన్య జోష్,రామ్ చరణ్ ఆరంజ్ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. అనంతరం గుంటూరు టాకీస్ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా హీరోగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన డిజె టిల్లు సినిమా ద్వారా మంచి హిట్ కొట్టారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా మరి కొన్ని సినిమాలకు.కూడా ఈయన కమిట్ అయినట్లు తెలుస్తుంది.
ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరెంజ్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి సిద్దు ఇప్పుడు ఏకంగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో హీరోగా సినిమా చేయబోతున్నారు.ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా నేడు పూజ కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Siddhu Jonnalagadda: ఘనంగా పూజా కార్యక్రమాలు…
పలువురు సినీ సెలబ్రిటీల సమక్షంలో ఈ సినిమా పూజ కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని SVCC పతాకంపై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవర్ని తీసుకుంటారు..అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విషయాలను కూడా తెలియజేయబోతున్నట్లు సమాచారం.ఇక బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ద్వారా హిట్ అందుకున్న అనంతరం సిద్దు జొన్నలగడ్డతో సినిమాకు కమిట్ అయ్యారు.