Siddu Jonnalagadda: డీజే టిల్లు సినిమా ద్వారా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. ఈయన ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ చిత్రం డీజే టిల్లు స్క్వేర్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందు నుంచి పలు వివాదాలను ఎదుర్కొంటుంది. ఈ సినిమా డైరెక్టర్ తో సిద్దుకి పడటం లేదని అందుకే డైరెక్టర్ మారిపోయారని వార్తలు వచ్చాయి.

హీరో సిద్దు జొన్నలగడ్డ కారణంగా హీరోయిన్స్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారు అంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమా గురించి వస్తున్నటువంటి వివాదాలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. తనకు ఎవరితోనూ మనస్పర్ధలు లేవని ఈ సినిమా కోసం ముందుగా అనుపమను సంప్రదించాము అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక తాజాగా మరొక ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దు జొన్నలగడ్డ నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా బాలకృష్ణ చాలా ఆవేశపరుడని ఆయనను చూస్తే చాలామంది దూరంగా ఉంటారని ఆయనతో మాట్లాడటానికి భయపడతారని చెబుతూ ఉంటారు.కానీ అతనితో పని చేసిన వారిని కనుక బాలయ్య గురించి అడిగితే తన మంచి మనస్తత్వం గురించి ఎంతో గొప్పగా చెబుతారు.

Siddu Jonnalagadda:చిన్నపిల్లాడి మనస్తత్వం….
ఈ క్రమంలోనే సిద్దు జొన్నలగడ్డ సైతం బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలకృష్ణ గారు ఒక విశాలమైన హృదయం కలిగిన వారని తెలిపారు. ఆయన ఒక మనిషిని తన మనిషిగా భావిస్తే వారికోసం ఎంత దూరం వెళ్లడానికైనా వెనకాడరని,అందమైన దయ కలిగిన చిన్నపిల్లాడి మనస్తత్వం బాలకృష్ణ గారిది అంటూ ఈ సందర్భంగా బాలయ్య గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































