కివి ఫ్రూట్ అధిక పోషకాల గనిగా ప్రసిద్ధి చెంది ప్రత్యేకమైన రుచితో అందరినీ ఆకర్షిస్తోంది. వీటిని చైనీస్ గూస్బెర్రీ అని కూడా అంటారు.కివి పళ్లు తీపి మరియు పులుపు కలిసిన అద్భుతమైన రుచితో ఉండి నారింజ, బత్తాయి కంటే అధిక మొత్తంలో విటమిన్ సి లభిస్తుంది.కావున ప్రతి రోజు కివి పండ్లను ఆహారంగా తీసుకుంటే తీసుకుంటే వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు తద్వారా సీజనల్గా వచ్చే వ్యాధులతో పాటు అనేక రకాల వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.కావున రోజువారి ఆహారంలో కివి ఫ్రూట్ ను ఆహారంలో తీసుకోవడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.
Advertisement
అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కివి పండును ప్రతిరోజూ తినడం మన ఆరోగ్యానికి మంచిదే ! అయినప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలతో నిత్యం బాధపడేవారు కివి పండ్లను వీలైనంతవరకు తినకుండా ఉండడమే మంచిదని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కివి పండ్లను తినకూడదో ఇప్పుడు చూద్దాం.
ముఖ్యంగా దీర్ఘకాలం పాటు కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కివి ఫ్రూట్ కు దూరంగా ఉండటమే మంచిది. కారణం ఏమిటంటే కివి పండ్లలో అత్యధికంగా పొటాషియం కలిగి ఉంటుంది.కాబట్టి కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పొటాషియం కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే కివి ఫ్రూట్ కు దూరంగా ఉండటమే మంచిదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే కివి పండులో కూడా నిమ్మ, నారంజ మాదిరిగానే విటమిన్ సి తోపాటు సిట్రిక్ యాసిడ్ అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారికి ఇలాంటి పండ్లను తినడం అంత మంచిది కాదు.
మీరు తరచూ చర్మ సమస్యలతో మరియు అలర్జీలతో బాధపడుతుంటే కివి ఫ్రూట్ ను అధిక మొత్తంలో తీసుకోకపోవడమే మంచిది.అలర్జీ సమస్య ఉన్నవారు కివి ఫ్రూట్ ను అధికంగా తీసుకుంటే చర్మంపై దద్దుర్లు రావడం తామర, చర్మం ఎర్రబడటం, పెదవులు, నాలుక వాయడం జరుగుతుంది. అలాగే జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు కివి పండ్లను అధికంగా తింటే విరేచనాలు, వివిధ రకాల అలెర్జీలకు కారణం అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు రోజుకొక కివి ఫ్రూట్ తింటే ఆరోగ్యానికి మంచిదే. అయితే ఒకటి కంటే ఎక్కువ పళ్ళను ఆహారంగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు సూచించడం జరిగింది.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఎన్నో కొత్త సినిమాలు అప్డేట్స్ తెలియజేశాయి.
Advertisement
ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి దీపావళి పండుగను పురస్కరించుకొని బిగ్ అప్డేట్ మేకర్స్ ఇచ్చారు. రామ్ చరణ్ లుక్ కి సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేశారు.అది ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించినా కూడా ట్రోల్స్ మాత్రం ఆగటం లేదు. తాజాగా ఈ పోస్టర్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మాస్ లుక్ లో చరణ్…
ఈ పోస్టర్ లో రామ్ చరణ్ లుంగీ కట్టి మాస్ లుక్ లో అదరగొట్టాడు. పట్టాలపై విలన్ మనుషులని రామ్ చరణ్ కొట్టి పడినట్టు తెలుస్తుంది. చరణ్ మాస్ లుక్ లో లుంగీ కట్టి వాళ్ళ పక్కనే కూర్చున్నాడు. ఆ పోస్టర్ లో రామ్ చరణ్ లుక్ చూసిన బన్నీ ఫాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే పుష్ప సినిమాలో అచ్చం అల్లు అర్జున్ లాగే కనిపించడంతో ఏంటి చరణ్ అన్న మా బన్నీ అన్నను చూసి కాపీ కొట్టావా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Rajinikanth: తమిళ స్టార్ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరిట రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం, ఇటీవలే లక్షలాది మంది అభిమానులతో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయగా ఈ సభ ఎంతో విజయవంతం అవ్వడమే కాకుండా తమిళనాడు రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చలకు కారణం అయ్యింది.
Advertisement
ఇకపోతే ఈ బహిరంగ సభ గురించి ఇప్పటికే పలువురు వివిధ రకాలుగా చర్చలు జరుపుతున్నారు. తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకొని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఇంటి ఎదుట ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన విజయ్ ఎన్నికల బహిరంగ సభ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
విజయ్ రాజకీయ రంగ ప్రవేశం విజయవంతమైందని, టీవీకే పార్టీ తొలి బహిరంగ సభను చక్కగా నిర్వహించారని కొనియాడారు. విజయ్ తన పార్టీ సభను ఎంతో విజయవంతంగా నిర్వహించారని, అందుకు అతడిని అభినందిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం రజనీకాంత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయవంతంగా నిర్వహించారు.. గతంలో కూడా రజనీకాంత్ రాజకీయాలలోకి రావాలని భావించారు అందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి కానీ అనారోగ్య సమస్యల కారణంగా కొంతమంది ఆయన శ్రేయోభిలాషులు ఇలాంటి టైంలో రాజకీయాలలోకి వెళ్లడం మంచిది కాదని సూచించడంతో రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశాన్ని రద్దు చేసుకున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న ఉదయనిది స్టాలిన్ కమల్ హాసన్ విజయ్ దళపతి వంటి వారందరూ కూడా రాజకీయాలలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పాలక మండలిని ఏర్పాటు చేస్తూ నిన్న ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో టీవీ 5 ఛానల్ అధినేత బీఆర్ నాయుడును టీటీడీ ఛైర్మన్ గా నియమించారు. ఆయనతోపాటు మరో 23 మందిని కలుపుకొని మొత్తం 24 మందికి టీటీడీలో స్థానం కల్పించారు.
Advertisement
ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బి ఆర్ నాయుడు నియమితులు కావడంతో పలువురు హర్షం వ్యక్తం చేయగా మరికొందరు తీవ్రస్థాయిలో ఈయనపై విమర్శలు చేస్తున్నారు. బి ఆర్ నాయుడు క్రిస్టియన్ అని తిరుమల తిరుపతి దేవస్థానికి ఒక క్రిస్టియన్ చైర్మన్ గా ఉండడం ఏంటి అంటూ కొందరు సోషల్ మీడియాలో అసత్యపు వార్తలను ప్రచారం చేస్తున్నారు.
ఇలా బిఆర్ నాయుడు గురించి వస్తున్నటువంటి వార్తలపై కూటమి ప్రభుత్వం స్పందించింది. బి ఆర్ నాయుడు క్రిస్టియన్ అంటూ కొంతమంది ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇలా తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఇలా బి ఆర్ నాయుడు క్రిస్టియన్ అంటూ వచ్చే వార్తలలో నిజం లేదని తేల్చి చెప్పారు.
హిందువులే ఉండాలి.. ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ ఉన్న సమయంలో వెనుక శిలువు ఆకారంలో ఉన్నటువంటి ఒక వస్తువు కనిపించడంతో ఆయన క్రిస్టియన్ అంటూ కొందరు ప్రచారం చేయడం మొదలుపెట్టారు కానీ ప్రభుత్వం స్పందించడంతో ఈ వార్తలకు పూర్తిగా చెక్ పడినట్టు అయింది. ఇక కొత్త చైర్మన్గా నియమితులైన బి.ఆర్ నాయుడు తిరుమలలో చాలా చేపట్టాల్సిన పనులు ఉన్నాయని గత ప్రభుత్వం దేవస్థాన ప్రతిష్టను దిగజార్చింది అంటూ ఈయన మండిపడ్డారు అలాగే ఆలయంలో పనిచేసే సిబ్బంది మొత్తం హిందువులే ఉండాలని ఈయన ఆదేశాలను జారీ చేశారు.