ఈ ఆకును ఇంట్లో పూజించండి.. ఆయురారోగ్యాలతో ఉంటారు.. ఇంకా ఎన్నో ఉపయోగాలు..!

0
308

మన దగ్గర ఎక్కువగా వినాయక చవితి పూజల్లో బిల్వ పత్రాన్ని ఉపయోగిస్తారు. దినిని మారేడు దళం అని కూడా అంటారు. దీనికి హిందూ ధర్మంలో విశిష్ట స్థానం ఉంది. అయితే ఈ బిల్వ పత్రంలో అనేక రకాలుగా ఉన్నాయి. ఏకబిల్వం, త్రి బిల్వం, సప్త బిల్వం, షణ్ముఖ బిల్వం, పంచముఖ బిల్వం, అఖండ బిల్వం వీటితో పూజిస్తే అనేక రాకలుగా ఫలితాలు వస్తాయి.

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం౹ త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ మహాదేవుడిని పూజిస్తారు. ఈ త్రిదళ బిల్వ పత్రంలో ఎడమవైపు బ్రహ్మ, మధ్యలో శివుడు, కుడివైపు విష్ణువు కొలువై వుంటారు. ఈ బిల్వపత్రాలను సోమ, మంగళ, శుక్ర వారములలో, సంక్రమణం, అసౌచం, రాత్రి సమయాలలో కోయరాదు. అఖండ బిల్వంలో అనేక ఆకులుంటాయి.

ఈ బిల్వ పత్రాన్ని మనం దాచుకునే డబ్బుల పెట్టెలో ఉంచితే మనం చేసే బిజినెస్ ‘మూడు పువ్వులు.. ఆరు కాయలుగా’ వృద్ధి చెందుతుందట. అంతే కాకుండా ఈ ఆకును ఇంట్లో పూజిస్తే వాస్త దోశాలు తొలగడంతో పాటు.. కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటారు. ఆరు నుంచి 21 రేకులు కలిగిన బిల్వ పత్రంతో పూజిస్తే చేపట్టిన పనుల్లో అఖండ విజయం లభిస్తుంది. త్రిదళం, ఉమ్మెత్త పువ్వుని కలిపి పూజిస్తే.. చతుర్విధ పురుషార్ధాలు లభిస్తాయి. శ్వేతబిల్వంతో పూజిస్తే ఆరోగ్యం సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వవృక్షము పుట్టినదని.. ఆమెను ‘బిల్వనిలయా’ అని పిలుస్తారని పురాణాల్లో చెబుతారు.

బ్రహ్మ వర్చస్సు పొందడానికి, సూర్యుని మెప్పుకోసం చేసే కామ్య యాగంలో బిల్వకొయ్యను యూప స్తంభముగా నాటుతారు. అశ్వమేధ యాగములో ఇలాంటి బిల్వయూపములను ఆరింటిని ప్రతిష్టించారని పురాణాల్లో ఉంది. ఈ మారేడు దళము శివార్చనకు పనికి వచ్చే, శివుడికి అతి ప్రీతికరమైన పత్రముగా కొలుస్తారు.