తమిళ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో చిత్రాల ద్వారా విశేష ఆదరణ సంపాదించుకున్న శింబు తాజాగా వెంకటేష్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా మానాడు అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా నవంబర్ 25 వ తేదీ విడుదల కావడంతో మేకర్స్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే హీరో శింబు మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు. వెంకటేష్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం అని అయితే మానాడు చిత్రం ద్వారా మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా కుదిరిందని శింబు వెల్లడించారు. ఈ సినిమా ఈ నెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇందులో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం ఉందని ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంటూ తెలిపిన శింబు ఉన్నఫలంగా కన్నీటి పర్యంతమయ్యారు. కొందరు నన్ను కావాలనే టార్గెట్ చేసి నన్ను ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇలా చెబుతూ శింబు ఎమోషనల్ కాగా అతనిని అక్కడే ఉన్నటువంటి పలువురు ఓదార్చారు.
అయినా ఆ సమస్యల గురించి నేను చూసుకుంటాను నా సంగతి మీరు చూడండి అంటూ ప్రేక్షకులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. శింబు ఇలా ఎమోషనల్ కావడంతో వేదికపై ఉన్నటువంటి భారతీరాజా, ఎస్ఏ చంద్రశేఖర్, ఎస్‌జే సూర్య, నిర్మాత కె.రాజన్ తదితరులు అతనిని ఓదార్చారు.
































