ప్రస్తుతం ఉన్న ఈ భయంకరమైన పరిస్థితులలో ఆటోలో లేదా బస్సులో ప్రయాణం చేయాలంటే ఎంతో సమస్యగా మారింది. ఈ క్రమంలోనే ఎక్కువమంది ద్విచక్ర వాహనాలలో వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకాయి ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ చూపు ఎలక్ట్రానిక్ వాహనాలు పై పడింది. ఈ క్రమంలోనే భారత మార్కెట్లో ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలకు భారీ డిమాండ్ ఏర్పడింది.

ఎలక్ట్రానిక్ వాహనాల డిమాండ్ ఏర్పడటంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలతో పాటు కొత్త స్టార్టప్ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన మరో స్టార్టప్ సంస్థ సింపుల్ ఎనర్జీ చేరింది. సింపుల్ ఎనర్జీ సంస్థ తన మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ ఇ-స్కూటర్‌ను ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
మార్క్ 2 పేరుతో మార్కెట్లోకి విడుదల కానున్న ఎలక్ట్రానిక్ స్కూటర్లు అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. ఈ స్కూటర్లు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.దీనిలో 4.8 కిలోవాట్ల లిథియం- అయాన్ బ్యాటరీని ఉపయోగిస్తున్నారు. టచ్ స్క్రీన్, ఆన్-బోర్డు నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫీచర్లు ఈ బండి ప్రత్యేకం.
ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఫ్లాగ్‌షిప్ ఇ-స్కూటర్ ధర రూ.1,10,000 నుండి రూ. 1,20,000 వరకు ఉంటుందని సింపుల్ ఎనర్జీ ప్రకటించింది. ఈ సందర్భంగా సింపుల్ ఎనర్జీ ఫౌండర్ మాట్లాడుతూ భారత మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ ఈ–స్కూటర్‌ను విడుదల చేయనుండటం పట్ల ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.


































