సింగరేణి సంస్థ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 372 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. లోకల్ అభ్యర్థులతో పాటు నాన్ లోకల్ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలో అతిపెద్ద బొగ్గు సంస్థలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న సింగరేణి సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. https://scclmines.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో సర్టిఫికెట్లకు సంబంధించిన సాఫ్ట్ కాపీలను అప్ లోడ్ చేయాలి. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 22వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2021 సంవత్సరం ఫిబ్రవరి 4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.

మొత్తం ఉద్యోగాలలో ఫిట్టర్ 105 ఉద్యోగ ఖాళీలు, ఎలక్ట్రిషియన్ 51 ఉద్యోగ ఖాళీలు, వెల్డర్ 54 ఉద్యోగ ఖాళీలు, టర్నర్‌ లేదా మెషినిస్ట్‌ ట్రైనీ 22 ఉద్యోగ ఖాళీలు, మోటార్‌ మెకానిక్‌ ట్రైనీ 14 ఉద్యోగ ఖాళీలు, మౌల్డర్‌ ట్రైనీ ఉద్యోగ ఖాళీలు 19, జూనియర్‌ స్టాఫ్‌ నర్స్ ఉద్యోగ ఖాళీలు 84 ఉన్నాయి. జూనియర్‌ స్టాఫ్‌ నర్స్‌ ఉద్యోగాలకు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే లోకల్ ఉద్యోగ ఖాళీలతో పోల్చి చూస్తే జనరల్ ఉద్యోగ ఖాళీలు తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here