Singer Pranav : తెలుగులో ఎన్నో సింగింగ్ షోలు వస్తూనే ఉంటాయి. అందులో వచ్చే పాడుతా తీయగా, జీ తెలుగు సరిగమప సింగింగ్ షో బాగా పాపులర్ అయ్యాయి. ఈ షోల వల్ల ఎంతో మంది కొత్త గాయనీగాయకులు సినిమా ఇండస్ట్రీ కి పరిచయమవుతున్నారు. అలా ఇండస్ట్రీ కి దొరికిన మరో టాలెంటెడ్ సింగర్ ప్రణవ్. తన సాంగ్స్ తో చూసే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అలరిస్తున్న ప్రణవ్ తన పాటలతో పాటు యాక్టింగ్ తో కూడా మంచి అవకాశాలను అందుకుంటున్నాడు. అటు సినిమాల్లో నటించే అవకాశంతో పాటు పాడే అవకాశాన్ని అందుకుంటూ దూసుకుపోతున్న ఈ యువ కెరటం తన సక్సెస్ సీక్రెట్ మాత్రం కష్టపడతు ఒకటి కాకపోతే మరో అవకాశాన్ని పట్టుకుని ముందుకు సాగడమే అని చెబుతున్నాడు.

19 ఏళ్ల కే లవ్ స్టోరీ… రొమాన్స్ బాగా చేస్తా…
ప్రణవ్ సరిగమప షో ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు దీంతో పలు యూట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూ కూడా ఇస్తున్నాడు. అలా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా కొంత అభిమానులకు తెలిసింది. ప్రణవ్ అమెరికా నుండి సింగర్ లేదా యాక్టర్ అవ్వాలన్న కోరిక తో ఇండియా వచ్చాడు. ఇక ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నాడట. చిన్నతనం నుండి చదువులో చురుగ్గా ఉంటూనే డాన్స్, సింగింగ్ మీద ఆసక్తి పెంచుకున్న ప్రణవ్ రెండింటిలోనూ రాణించాడు. ఇక 19 ఏళ్ల వయసులో తొలిసారి ప్రేమలో పడిన ప్రణవ్, డేటింగ్స్ కి కూడా వెళ్ళేవాడట అయితే అది ఇక్కడ కాదు అమెరికాలో.

ఇక అమ్మాయిలలో మొదట గమనించేది వారి కళ్ళు అంటూ చెప్పిన ప్రణవ్ తను రహస్యలను దాచలేనని చెప్పాడు. తన వ్యక్తిగత విషయాల్లో ఏమాత్రం దాచుకోకుండా అత్యంత స్నేహితులకు చెప్పేస్తానని అయితే ఇతరులు ఏవైనా చెప్పిన సీక్రెట్స్ మాత్రం దాచుకుంటానని చెప్పాడు. ఇక తనకున్న హిడెన్ టాలెంట్ ఏంటని అడిగితే మాత్రం భిన్నమైన సమాధానం ఇచ్చాడు ప్రణవ్. తాను చాలా రొమాంటిక్ అని లవ్ లో చాలా రొమాంటిక్ గా ఉంటానని, చాలా మంది ఏదైనా ప్రేమించిన వారికి తమ మీద ఉన్న ఇష్టాన్ని చెప్పడానికి ఇబ్బంది పడుతారు. కానీ నేను ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడుతాను అంటూ తన అభిరుచులను పంచుకున్న ప్రణవ్ ప్రస్తుతం పతంగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇతర సినిమాల్లో పాడే అవకాశాన్ని దక్కించుకున్నాడు.































