Singer Revanth: బిగ్ బాస్ హౌస్ అంటేనే ఒక కొత్త వాతావరణంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. అందరూ తెలియని వారే ఫోన్ లేకుండా అక్కడున్న వారితోనే మాట్లాడుతూ 24 గంటల పాటు గడపాల్సి ఉంటుంది.అయితే కొంతమందికి ఇలాంటి వాతావరణంలో అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది మరికొందరు మాత్రం క్షణాలలో కలిసిపోతుంటారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి సింగర్ రేవంత్ మాత్రం బిగ్ బాస్ హౌస్ కి అలవాటు పడలేకపోతున్నారని అర్థమవుతుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన మొదటి రోజే కన్నీళ్లు పెట్టుకోవడమే కాకుండా ఏకంగా తన నోటి వెంట బూతు పదాలు కూడా మాట్లాడుతున్నారు.అయితే ఈయన బూతు పదాలు మాట్లాడటంతో వెంటనే తన తప్పు గ్రహించుకొని ఒక్కసారిగా అందరికీ సారీ చెప్పారు..
ఇక హౌస్ లో రేవంత్ ఇతర కంటెస్టెంట్లపై చికాకు పడుతున్నారు తాను వండింది తింటే తినండి లేదంటే లేదు అని విసుక్కోవడమే కాకుండా తోటి కంటెంట్స్ ఎవరు తనకు పరిచయం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇలా రేవంత్ వింతగా ప్రవర్తించడంతో నెటిజన్లు అసలు రేవంత్ కి ఏమైంది ఇలా ప్రవర్తిస్తున్నారేంటీ అని కామెంట్లు చేస్తున్నారు.

Singer Revanth: మద్దతుగా నిలిచిన అభిమానులు…
ఈ క్రమంలోనే మరికొందరు ఇలా మొదటి రోజే అందరిపై చికాకు పడి బూతులు మాట్లాడితే ఎలా బాసు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే రేవంత్ అభిమానులు మాత్రం ఆయనకు సపోర్ట్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ లో అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది.ఈ సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరగడం సర్వసాధారణం అంటూ అభిమానులు రేవంత్ కి మద్దతుగా నిలబడ్డారు.































