తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన తియ్యని గాత్రం తో ఎన్నో మధురమైన పాటలను పాడి ఎంతోమంది తెలుగు వారిని ఆకట్టుకుంది. అయితే ఈ ఏడాది మొదటలో సునీత రామ్ వీరపనేని రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇంతకుమునుపు మనం ఎన్నడూ చూడని సునీతను చూస్తున్నాము.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా బుల్లితెరపై డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్ లోకి వచ్చిన సునీత తన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం బయట ఉన్న భయాందోళన పరిస్థితులను గురించి తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ క్రమంలోనే నిన్న రాత్రి 8 గంటలకు లైవ్ లోకి వచ్చిన సునీత అభిమానులు అడిగిన పాటలను పాడుతూ అందరిని సంతోష పెట్టారు. ఈ క్రమంలోనే సునీత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇలా చెబితే అందరికీ కోపం వస్తుంది. కానీ ఎవరు బయటికి వెళ్లకుండా, తప్పనిసరి అయితే తప్ప తగు జాగ్రత్తలు పాటిస్తూ బయటికి వెళ్ళండి.ఈ విధంగా నేను పాటలు పాడితే కొందరు తమ బాధలను మర్చిపోతారు అంటే ప్రతిరోజు రాత్రి ఇదే సమయానికి ఓ అరగంట మీ కోసం సమయం కేటాయిస్తానని మీకోసం లైవ్ లో పాటలు పాడుతానంటూ అభిమానులకు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here