Singer Sunitha: సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన గాత్రంతో తెలుగులో అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. చిన్న వయసులో పెళ్లి, పిల్లలు ఆ తరువాత విడాకులు ఇన్ని ఇలా వచ్చిన సమస్యపై కూడా పోరాడి నిలబడింది. తన పిల్లలను పెద్ద చేసింది.

ఇదిలా ఉంటే గతేడాది రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. కొద్దిమంది సన్నిహితులు, బంధువుల మధ్య వివాహం జరిగింది. అప్పటి నుంచి చాలా అన్యోన్యంగా ఉంటోంది ఈ జంట. తాజాగా ఈ జంట మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.

దీంతో ఈ ఏడాది కాలంలో తమ అనుభవాలను ఈ జంట పంచుకుంది. పది నిమిషాల వీడియోను షేర్ చేశారు. ఇందులో సునీత వాళ్లమ్మ మాట్లాడూతూ… ‘సునీత తన బరువు, బాధ్యతలను నెరవెరుస్తూ చిరునవ్వు, సహనంతో జీవితంలో ముందుకు వేస్తుం దని.. ఆమె డేరింగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ అని’ చెప్పుకొచ్చారు.
వీరి కుటుంబ సభ్యులు కూడా..
ఇక సునీత తన భర్త రామ్ వీరపనేని గురించి చాలా విషయాలు ప్రేక్షలకులతో పంచుకుంది. ఆయన ముక్కుసూటి మనిషి అని, నిజాయితీ పరుడని చెప్పొచ్చు. రామ్ ఒక మంచి కాఫీ లాంటి అబ్బాయ్ అంటూ కితాబు ఇచ్చింది. రామ్ తనకు ఎనిమిదేళ్లుగా తెలుసునని పెళ్లికి ముందు ఎలా ఉన్నారో.. ఇప్పుడు అలాగే ఉన్నారని చెప్పింది సునీత. వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులు కూడా ఈ జంటపై తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. అందరూ.. ఈ జంటకు వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పారు.


































