ఈ మహిళా దినోత్సవం నాడు సింగర్ సునీత పోస్ట్ ఎందుకు వైరల్ అవుతుందో తెలుసా?

0
100

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ దినోత్సవం సందర్బంగా ప్రతి ఒక్కరు దేశం లోని మహిళలందరికీ సోష మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. స్త్రీ లేకుంటే ఈ సృష్ట్టి లేదంటూ మరియు మహిళల ఆవశ్యకతను వివరిస్తూ సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతుండం విశేషం. ప్రతి ఒక్క మహిళా ఈరోజు తమ గెలుపుని సెలెబ్రేట్ చేసుకోవలసిందే. అయితే ఈ పండగ సందర్బంగా ప్రముఖ సింగర్ సునీత సోషల్ మీడియా లో ఒక పోస్ట్ ని పెడుతూ మెసేజ్ ని కూడా జత చేసారు.

నన్ను నిలదీశారు, నన్ను ఎగతాళిచేసారు, నన్ను తప్పుబట్టారు, విమర్శించారు,నన్ను ఇబ్బందిపెట్టారు, ఇన్ని చేసి ఇప్పుడు విషెస్ చెబుతున్నారా అని పోస్ట్ ని పెట్టింది సునీత. అయితే సునీత ఆలా పోస్ట్ పెట్టడం పై నెట్ లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టిందనే వార్తలు వస్తున్నాయి.

సింగర్ సునీత ఇటీవలే రామ్ వీరపనేని అనే బిజినెస్ పర్సన్ ని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఒక మహిళగా, నేను వెనక్కి తగ్గను మీరు ఎన్నిసార్లు నన్ను ఎత్తిచూపాలని చూసి నేను నవ్వుతు సమాధానం ఇస్తానని పోస్ట్ చేసారు సునీత.

సునీత తెలుగు సినిమాలకు ఎన్నో పాటలను పాడారు. రామ్ తో వివాహం జరిగిన తర్వాత సింగర్ నుండి బిజినెస్ పర్సన్ గా కూడా మారిపోయారు సునీత. ఒక పక్క సినిమాల్లో మరోపక్క బిజినెస్ లో రెండింటిలోనూ సమానమైన పాత్రలను పోషిస్తుంది. రెండో పెళ్లి అనగానే చాలా మందికి ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. మరి ముఖ్యంగా సినీ ప్రముఖులు చేసుకుంటే అదొక వార్తగా సోషల్ మీడియా లో తిరుగుతూ ఉంటుంది. కాని సింగర్ సునీత వివాహం మాత్రం ఆమెకు అన్ని విధాలా లాభం తో పాటు బిజీగా మారిందనే చెప్పుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here