Srihan: బిగ్ బాస్ 5 సీజన్ ముగిసినా ఇప్పటికీ ఏదో విషయంలో ట్రెండింగ్ లోనే ఉంటోంది. దీంతో బిగ్ బాస్ 6 గురించి అందరూ ఆలోచిస్తున్నారు. ఈ సారి ఎవరెవరు కంటెస్టెంట్స్ ఉంటారో అని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 5 సీజన్ చాలా ఫేమస్ అయింది.

ఇందుకు ఇంతలా ఫేమస్ కావడానికి కారణం రెండు జంటలు విడిపోవడం అనే వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌజ్ లో సిరి, షన్నూ చాలా క్లోజ్ గా మూవ్ కావడంతో ఇటు షన్నూ- దీప్తి సునయన, శ్రీహాన్- సిరి జంటల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇప్పటికే షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయలు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇటీవల ఇన్ స్టా వేదికగా దీప్తి సునయన, షన్నూతో విడిపోతున్నట్లు ప్రకటించింది.

ఇదిలా ఉంటే.. సిరి, శ్రీహాన్ మధ్య కూడా గ్యాప్ ఏర్పడిందని తెలుస్తోంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత.. వీరిద్దరూ ఇప్పటి వరకు కలవకపోవడం చూస్తే వీళ్లు కూడా రేపో మాపో బ్రేకప్ చెప్పుకోవచ్చని తెలుస్తోంది. ఈ వివాదాల మధ్య బిగ్ బాస్ నెక్ట్ సీజన్ కంటెస్టెంట్ల వేట కూడా సాగుతోందని తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 6లో శ్రీహాన్..
ఇదిలా ఉంటే 24/7 ఓటీటీ బిగ్ బాస్ కూడా సిద్దం అవుతోంది. హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుందని ఇప్పటికే నాగార్జున ప్రకటించాడు. అయితే ఈసారి శ్రీహాన్ బిగ్ బాస్ నెక్ట్స్ సీజన్ లో తప్పకుండా ఉంటాడనే చర్చ జరుగుతోంది. సిరి, షన్నూల వ్యవహారంతో సిరి చాలా నెగిటివిటీని మూటగట్టుకుంది. మరోవైపు శ్రీహాన్ సింపతితో పాజిటివిటీ సంపాదించుకున్నాడు. ఇటీవల స్టార్ మాలో స్టార్ మ్యూజిక్ షోలో ప్రోమోలో కనిపించాడు. గతంలో స్టార్ మాలో షోల్లో కనిపించిన వ్యక్తులు బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వచ్చారు. అనవాయితీ కొనసాగితే శ్రీహాన్ కూడా నెక్ట్స్ సీజన్ లో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది.































