Sitara: ఇంత చిన్న వయసులోనే రేర్ ఫీట్ సాధించిన సితార… జువెలరీ సమస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా!

0
20

Sitara: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇంత చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సితార ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలు ఇన్ స్టా రీల్స్ అంటూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు..

ఇలా ఇంత చిన్న వయసులోనే ఈమె కంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి ఇలా సితారకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని ఈమెకు ఇండస్ట్రీలో ఇప్పటికే అవకాశాలు కూడా వస్తున్నాయి. సీతారకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రముఖ నగల సమస్థ సితారకు భారీ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ప్రముఖ నగల సమస్థ సితారను తమ నగలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఇప్పటికే ఈ యాడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయిందని తెలుస్తుంది. ప్రముఖ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో ఈ యాడ్ కి సంబంధించిన షూటింగ్ దాదాపు మూడు రోజులు పాటు జరిగినట్టు సమాచారం. త్వరలోనే ఈ యాడ్ ప్రసారం కాబోతోంది.

Sitara: సంతోషంలో మహేష్ ఫ్యాన్స్…

ఇలా ఈ నగల సమస్థకు సితార బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం కోసం భారీగానే రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలుస్తుంది.ఇలా మహేష్ బాబు కూతురు ఇంత చిన్న వయసులోనే ఇలాంటి గొప్ప అవకాశాన్ని అందుకున్నారనే విషయం తెలియడంతో మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూచర్ సితార గొప్ప స్టార్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు.