భారత దేశంలో కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే గత నాలుగు రోజుల నుంచి పాజిటివ్ కేసులు సంఖ్య కేవలం ఒక్క రోజులోనే మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే మరణాల సంఖ్య కూడా వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ విధంగా భారత దేశంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టేడ్రోస్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఇండియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆవేదన చెందారు.

భారత దేశంలో ప్రస్తుతం పరిస్థితులు చేయి దాటి పోయాయని, ఇలాంటి పరిస్థితుల నుంచి భారతదేశాన్ని కాపాడటం కోసం అవసరమైన సహాయం చేయడానికి ప్రయత్నిస్తామని డైరెక్టర్ జనరల్ తెలియజేశారు. డబ్ల్యూహెచ్ఓ నుంచి ఇప్పటివరకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, లేబరేటరీ పరికరాలు వంటి అత్యవసరమైన వాటన్నింటిని అందజేస్తున్నట్లు టెడ్రోస్ తెలిపారు.
పోలియో క్షయ వంటి వ్యాధుల నియంత్రణ కార్యక్రమాలకు సంబంధించిన దాదాపు 2600 మందికి పైగా నిపుణులు భారత ఆరోగ్య సంస్థతో కలిసి పని చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.డబ్ల్యూహెచ్ఓ కోవిడ్ టెక్నికల్ విభాగం చీఫ్ మారియా వెన్ కెర్ఖోవే మాట్లాడుతూ భారత్ లో ఈ విధంగా కేసులు పెరగడం ఎంతో ఆశ్చర్యంగా అనిపించిందని ఆయన తెలియజేశారు.
ఈ విధంగా కేసులో పెరగడం ఒక భారత్ లో మాత్రమే ప్రత్యేకం కాదని ఇంతకుముందు ఇలాంటి పరిస్థితులు పలు దేశాలలో తలెత్తాయి.ఇప్పటికైనా సంరక్షణ చర్యలు చేపట్టకపోతే మరిన్ని దేశాలు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని డబ్ల్యూహెచ్ఓ అధికారులు వెల్లడించారు































